బిగ్ బాస్2: ఈ వారం వెళ్లేది ఎవరంటే..?

First Published 21, Aug 2018, 2:57 PM IST
bigg boss2: who will eliminate in this week
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్ ఆసక్తికరంగా సాగాయి. నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన కౌశల్, తనీష్, దీప్తి, పూజా రామచంద్రన్ లు ఉన్నారు

బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్ ఆసక్తికరంగా సాగాయి. నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన కౌశల్, తనీష్, దీప్తి, పూజా రామచంద్రన్ లు ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో గణేష్ గనుక ఉండి ఉంటే అతడిని బయటకి పంపాలని కౌశల్ ఆర్మీ అనుకుంది. కానీ ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండడంతో కౌశల్ ని కాపాడుకుంటే చాలని అతడికి ఓట్లు వేస్తున్నారు.

బిగ్ బాస్ కూడా కావాలనే టఫ్ కంటెస్టెంట్స్ ని నామినేషన్స్ లో ఉండేలా చేశారని టాక్. ఇక ఈ వారం హౌస్ నుండి ఈ నలుగురిలో ఎవరు బయటకి వెళ్లబోతున్నారనే విషయంలో పూజా రామచంద్రన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కౌశల్ ని సేవ్ చేయడానికి కౌశల్ ఆర్మీ ఎలాగూ ఉంది. తనీష్ కి కూడా అభిమానుల ఆదరణ ఉండడంతో ఈ వీక్ తనీష్ కూడా సేవ్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ఇక మిగిలిన ఇద్దరిలో కంపేర్ చేస్తే పూజ కంటే దీప్తికి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. దానిప్రకారం ఈ వారం పూజా రామచంద్రన్ బయటకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి హౌస్ నుండి ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నామని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపడడానికి ఏం లేదు. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: సామ్రాట్ తో ఎక్కువగా ఉండకు.. గీతాతో చర్చ!

బిగ్ బాస్2: మరోసారి నామినేషన్స్ లో కౌశల్

loader