బిగ్ బాస్2: సామ్రాట్ తో ఎక్కువగా ఉండకు.. గీతాతో చర్చ!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 21, Aug 2018, 11:24 AM IST
bigg boss2: geethamadhuri about her relationship with samrat
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 పై మొదట్లో నెగెటివ్ కామెంట్స్ వినిపించినా ఇప్పుడు మాత్రం షో రసవత్తరంగా సాగుతోంది

బిగ్ బాస్ సీజన్ 2 పై మొదట్లో నెగెటివ్ కామెంట్స్ వినిపించినా ఇప్పుడు మాత్రం షో రసవత్తరంగా సాగుతోంది. షో ఆరంభంలో సామ్రాట్-తేజస్వి, తనీష్-సునైనా జంటలు సన్నిహితంగా మెలుగుతుండడం ఆడియన్స్ లో చాలా మందికి రుచించలేదు. తేజస్వి బయటకి వచ్చేసిన తరువాత సామ్రాట్ రియల్ గేమ్ ఆడుతున్నాడనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇక తాజాగా సామ్రాట్.. గీతామాధురి సన్నిహితంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అబ్బాయి నాకు క్లోజ్ అయిపోతున్నాడంటూ గీతా.. శ్యామలతో చెప్పింది. రాత్రిపూట సామ్రాట్-గీతాలు మాట్లాడుకోవడం, ఇద్దరూ కలిసి హౌస్ లో అల్లరి చేయడం వంటి విషయాలు కొందరికి సందేహాలు కలిగేలా చేశాయి. అయితే ఇదే విషయాన్ని దీప్తి నల్లమోతు, శ్యామల కలిసి గీతామాధురికి చెప్పాలనుకున్నాడు.

వారు ఆ విధంగా చెబుతున్నప్పుడు గీతా 'మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో.. నా లైఫ్ లో నందు ప్లేస్ ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. 70 రోజులు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కచ్చితంగా క్లోజ్ అవుతారు. నాకు సామ్రాట్, రోల్ మాట్లాడుతుంటే నా స్నేహితులతో ఉన్నట్లుగా అనిపించి వారితో సన్నిహితంగా మెలుగుతున్నాను' అంటూ వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.  

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: మరోసారి నామినేషన్స్ లో కౌశల్

బిగ్ బాస్2: సునైనాకి కౌశల్ ఏంచెప్పి పంపించాడంటే..!

loader