బిగ్ బాస్2: మరోసారి నామినేషన్స్ లో కౌశల్

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 20, Aug 2018, 11:15 PM IST
bigg boss2: kaushal nominated for elimination in this week
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 డెబ్బై రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే చాలా మంది హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకి వెళ్లిపోయారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో దీప్తి సునైనా హౌస్ ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది

బిగ్ బాస్ సీజన్ 2 డెబ్బై రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే చాలా మంది హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకి వెళ్లిపోయారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో దీప్తి సునైనా హౌస్ ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక వచ్చే ఆదివారం ఎలిమినేషన్ కోసం ఈరోజు ఎపిసోడ్ లో నామినేషన్స్ జరిగాయి. కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా పిలిచిన బిగ్ బాస్ నామినేషన్స్ కోసం హౌస్ మేట్స్ లో ఇద్దరి పేర్లు, వారిని ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పమని చెప్పారు. 

ముందుగా సామ్రాట్ వెళ్లి పూజ రామచంద్రన్, కౌశల్ ని నామినేట్ చేశాడు. తనీష్.. దీప్తి నల్లమోతు, పూజాలను నామినేట్ చేయగా కౌశల్.. సామ్రాట్, తనీష్ లను నామినేట్ చేశాడు. ఇలా హౌస్ లో ఈ వారం నామినేషన్స్ లో కౌశల్, తనీష్, పూజా రామచంద్రన్, దీప్తి నల్లమోతు నిలిచారు. ఎప్పటిలానే దీప్తి తనను నామినేట్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ కొన్ని లెటర్స్ పంపించాడు. ఆ లెటర్స్ లో ఒక్కో కంటెస్టెంట్ కి సంబంధించిన పబ్లిక్ ఒపీనియన్స్ రాసి ఉన్నాయి.

దాదాపు అందరినీ వేలెత్తి చూపినట్లుగా ఉన్న ఆ కామెంట్స్ ని హౌస్ మేట్స్ పెద్దగా పట్టించుకోలేదు కానీ దీప్తి నల్లమోతు.. శ్యామల తిరిగి హౌస్ లోకి వచ్చిందని సంతోషంగా ఉన్నట్లు నటిస్తుందని వచ్చిన కామెంట్ కి బాధ పడింది. ఏం చూసి ఇలాంటి కామెంట్స్ చేస్తారంటూ ఫైర్ అయింది. గీతామాధురి, శ్యామల ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.   

loader