బిగ్ బాస్2: షర్ట్ లేకుండా ఎంట్రీ ఇస్తోన్న యంగ్ హీరో..

bigg boss2: vijaya devarakonda's entry
Highlights

ఇటీవల విజయ్ 'KLM' ఫ్యాషన్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. అదే మాల్ ఇప్పుడు బిగ్ బాస్ కు అఫీషియల్ పార్ట్నర్. దీంతో తమ సంస్థకు బ్రాను అంబాసిడర్ గా ఉన్న విజయ్ దేవరకొండ బ్రాండ్ ఆఫ్ షర్ట్స్  తో 'రౌడీ వేర్' పేరుతో ఓ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు

బిగ్ బాస్ సీజన్2 రోజు రోజుకి రసవత్తరంగా సాగుతోంది. ప్రేక్షకులకు ఈ షోపై ఆసక్తి పెరిగే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ హౌస్ నుండి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు వీరిలో ఒకరిని తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. హౌస్ లోకి తిరిగి వెళ్లడానికి ఉబలాటపడుతోన్న ఈ ఆరుగురు కంటెస్టెంట్లు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.

తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ షోలోకి ఎంటర్ అయింది నటి పూజా రామచంద్రన్. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. తన సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ ఈ షోలోకి వస్తున్నాడేమో అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే విజయ్ 'రౌడీ వేర్' ప్రమోషన్స్ తో హౌస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇటీవల విజయ్ 'KLM' ఫ్యాషన్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. అదే మాల్ ఇప్పుడు బిగ్ బాస్ కు అఫీషియల్ పార్ట్నర్. దీంతో తమ సంస్థకు బ్రాను అంబాసిడర్ గా ఉన్న విజయ్ దేవరకొండ బ్రాండ్ ఆఫ్ షర్ట్స్  తో 'రౌడీ వేర్' పేరుతో ఓ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ షర్ట్ లేకుండా బుల్లెట్ పై వెళ్తోన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు రౌడీ వేర్ ప్రమోషన్స్ కోసం షర్ట్ లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. 

loader