బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కౌశల్. అతడి కోసం ఏకంగా ఆర్మీ కూడా తయారైంది. ఆ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న కౌశల్ ఈ వారంలో నామినేషన్స్ లో ఉన్నాడు. అతడితో పాటు తనీష్, దీప్తి, పూజాలు కూడా ఉన్నారు. తనీష్ ఎప్పుడు నామినేషన్స్ లో ఉంటాడా..? ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు కౌశల్ ఆర్మీ సభ్యులు.

కానీ ఈసారి కౌశల్ ని కాపాడుకోవాలని తనీష్ విషయాన్ని పక్కన పెట్టేశారు. అయితే ఓ సందర్భంలో తనీష్ దగ్గరకి వెళ్లిన కౌశల్ అతడితో ప్రేమగా మాట్లాడుతూ మనిద్దరం కలిసి ఆడే సమయం వచ్చిందంటూ మాట్లాడి హగ్ చేసుకున్నాడు. దీంతో వీరి మధ్య సఖ్యత కుదిరిందని అనుకున్నారు. నామినేషన్స్ సమయంలో తనీష్.. కౌశల్ ని నామినేట్ చేయలేదు. కానీ కౌశల్ తనీష్ ని నామినేట్ చేస్తూ కొన్ని కారణాలు చెప్పాడు.

దీంతో అతడి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. తనీష్ కి ఓట్లు వేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపైన్ జరుగుతోంది. బయటకి వెళ్లిన బాబు గోగినేని, దీప్తి సునైనాలు కూడా తనీష్ కి ఓట్లు వెయ్యమంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఎలా చూసుకున్నా ఈ వారం కౌశల్, తనీష్ సేవ్ అవ్వడం ఖాయం. దీప్తి, పూజాలతో ఎవరు బయటకి వెళ్లిపోతారో చూడాలి!