బిగ్ బాస్ కి కూడా అర్ధమై ఉండదు.. తేజస్వి విమర్శలు!

Bigg Boss2 Telugu: Tejaswi comments on amith and deepthi
Highlights

ఇప్పటివరకు హౌస్ లో ఇచ్చిన అన్ని టాస్క్ లతో పోలిస్తే ఈ సినిమా టాస్క్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగిందని చెప్పాలి. హౌస్ లో ఉన్న వారందరూ యాక్టివ్ గా ఇందులో పాల్గొన్నారు. యాంకర్ దీప్తి తను ఈ టాస్క్ బాగా ఎంజాయ్ చేశానని చెప్పగా గీతామాధురి నేను కూడా అంటూ చెప్పింది. అయితే తేజస్వి మాత్రం 'అసలు ఏం సినిమా తీశారు.. వాళ్లకైనా అర్థమైందా? బిగ్ బాస్ కి మాత్రం అర్ధమై ఉండదు' అంటూ బాబు గోగినేనితో చెబుతూ విమర్శించింది

బిగ్ బాస్ సీజన్ 2పై రోజురోజుకి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ టాస్క్ లను ఇవ్వడం, హౌస్ మేట్స్ లో కొందరికి ఇస్తోన్న సీక్రెట్ టాస్క్ లు ఆడియన్స్ కు ఎంటర్టైనింగ్ గా ఉంటున్నాయి. ఈ వారం హౌస్ లో ఉన్న సభ్యులను సినిమా చేసి చూపించాలని చెప్పారు బిగ్ బాస్. అన్ని అంశాలతో కూడిన ఒక సినిమాను హౌస్ మేట్స్ బుధవారం ఎపిసోడ్ లో పూర్తి చేశారు.

ఇప్పటివరకు హౌస్ లో ఇచ్చిన అన్ని టాస్క్ లతో పోలిస్తే ఈ సినిమా టాస్క్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగిందని చెప్పాలి. హౌస్ లో ఉన్న వారందరూ యాక్టివ్ గా ఇందులో పాల్గొన్నారు. యాంకర్ దీప్తి తను ఈ టాస్క్ బాగా ఎంజాయ్ చేశానని చెప్పగా గీతామాధురి నేను కూడా అంటూ చెప్పింది. అయితే తేజస్వి మాత్రం 'అసలు ఏం సినిమా తీశారు.. వాళ్లకైనా అర్థమైందా? బిగ్ బాస్ కి మాత్రం అర్ధమై ఉండదు' అంటూ బాబు గోగినేనితో చెబుతూ విమర్శించింది.

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన దీప్తి రాసిన డైలాగ్స్ ఏం  బాలేవని, వాటిని తెలుగురాని  అమిత్ ఇంకా గోరంగా డైరెక్ట్ చేశాడంటూ వారిపై కామెంట్స్ చేసింది. అమిత్ సీన్ చేసే ప్రతిసారి బిగ్ బాస్ కు వెళ్లి చెబుతుంటే ఆయనకు కూడా అర్ధమయ్యి ఉండదు అంటూ వారిపై పంచ్ లు వేసుకుంటూ నవ్వుకుంది.    

loader