బిగ్ బాస్2: తేజస్వి వర్సెస్ సామ్రాట్.. ఎలిమినేషన్ లో ట్విస్ట్

Bigg Boss2 Telugu sixth Elimination: tejaswi vs samrat
Highlights

నాని ఈ వారం ఎలిమినేషన్ లో రోల్ రైడా, తనీష్, దీప్తి లు సేఫ్ అని వెల్లడించారు. సామ్రాట్-తేజస్విలలో ఎవరు ఎలిమినేటి కాబోతున్నారని విషయాన్ని సస్పెన్స్ లో పెడుతూ రేపటి షోపై ఆసక్తి పెంచేశాడు. 

బిగ్ బాస్ రెండో సీజన్ శనివారం(జూలై 21) నాడు 42వ ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాని. ప్రతివారంలానే ఈ వారం కూడా ఓ పిట్ట కథ చెప్పాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిందనే చెప్పాలి. రోల్ రైడా, తనీష్, సామ్రాట్, తేజస్వి,దీప్తిలు నామినేషన్ కావడంతో ఈ నామినేషన్ ప్రాసెస్ పై పెద్ద చర్చే జరిగింది. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ఈ ఐదుగురిని హౌస్ లోకి ఎందుకు వచ్చారు..? ఎలా వచ్చారు..? ఒకవేళ ఎలిమినేట్  అయితే పరిస్థితి ఏంటి..? అనే విషయాలను ఇతర హౌస్ మేట్స్ తో పంచుకోమని చెప్పారు.

ఈ క్రమంలో తేజస్వి తను హౌస్ లోకి కేవలం డబ్బు కోసం మాత్రమే వచ్చినట్లు కానీ ఇక్కడకి వచ్చిన తరువాత చాలా మందితో కనెక్ట్ అయినట్లు చెప్పుకొచ్చారు. ''నా గత జీవితం మర్చిపోయి, నన్ను నేను నిరూపించుకోవడం కోసం హౌస్ లోకి వచ్చాను. నా పెర్సనల్ లైఫ్ గురించి చాలా రూమర్లు ఉన్నాయి. వాటిపై జనాల్లో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. నా తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పటికీ .. ముందు నువ్ ప్రూవ్ చేస్కో నా ఆరోగ్యం పర్లేదు అంటూ ధైర్యం చెప్పి పంపించారని'' సామ్రాట్ వెల్లడించాడు.

తెలుగులో రోల్ రైడా అనే ర్యాప్ సింగర్ ఉన్నాడని అందరికీ తెలియజేసేందుకు హౌస్ లోకి వచ్చినట్లు రైడా చెప్పుకొచ్చాడు.ఇలా ప్రతి ఒక్కరూ తన అనుభవాలను పంచుకున్న తరువాత నాని ఈ వారం ఎలిమినేషన్ లో రోల్ రైడా, తనీష్, దీప్తి లు సేఫ్ అని వెల్లడించారు. సామ్రాట్-తేజస్విలలో ఎవరు ఎలిమినేటి కాబోతున్నారని విషయాన్ని సస్పెన్స్ లో పెడుతూ రేపటి షోపై ఆసక్తి పెంచేశాడు. ఇప్పటివరకు హౌస్ లో ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానుండడం ఆయాసక్తిగా మారింది. అయితే ఆన్ లైన్ లో లీక్ అయిన ఓటింగ్ ను బట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది సామ్రాట్ అని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి!

loader