తేజస్వి.. రీఎంట్రీకి 'బిగ్ బాస్' ప్లాన్!

Bigg Boss2: Tejaswi to give reentry
Highlights

నిజానికి తేజస్వి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్. నిన్నటి ఎలిమినేషన్ లో సామ్రాట్ బయటకు వస్తాడని అందరూ ఊహించారు కానీ అనూహ్యంగా తేజస్వి బయటకు వెళ్లడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆమెపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించినా.. హౌస్ లో తేజస్వి లేకపోతే అల్లరి ఉండదని, షో డల్ అవుతుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు

'ఏదైనా జరగొచ్చు' అంటూ బిగ్ బాస్ సీజన్2 పై రోజురోజుకి అంచనాలను పెంచేస్తున్నారు నిర్వాహకులు. హోస్ట్ గా నాని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో నుండి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్విలు ఈ హౌస్ నుండి బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడు వీరిలో ఒకరిని తిరిగి హౌస్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఎలిమినేట్ అయిన ఆరుగురిలో ఓట్ల ద్వారా ఒకరిని హౌస్ లోకి తీసుకువెళ్లనున్నట్లు నాని వెల్లడించాడు. అయితే ఇదంతా కూడా తేజస్విని హౌస్ లోకి తీసుకువెళ్లడం కోసం చేసే ప్రయత్నమే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి తేజస్వి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్. నిన్నటి ఎలిమినేషన్ లో సామ్రాట్ బయటకు వస్తాడని అందరూ ఊహించారు కానీ అనూహ్యంగా తేజస్వి బయటకు వెళ్లడం అందరికీ షాక్ ఇచ్చింది.

ఆమెపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించినా.. హౌస్ లో తేజస్వి లేకపోతే అల్లరి ఉండదని, షో డల్ అవుతుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తేజస్విని హౌస్ లోకి తీసుకురావడం కోసమే ఈ ప్లాన్ చేస్తున్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. పైగా హౌస్ నుండి ఆమె బయటకు వచ్చిన తరువాత మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకపోవడంతో తేజస్వి రీఎంట్రీ పక్కా అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి!  

 

loader