బిగ్ బాస్2: దీప్తి సునైనాతో సామ్రాట్ డాన్స్.. తేజస్వి రియాక్షన్ ఇది

Bigg Boss2: Tejaswi comment on samrat dance performance
Highlights

దీప్తి సునైనా, సామ్రాట్ లు తమ మాస్ స్టెప్పులతో పాటకు పూర్తి న్యాయం చేశారు. సామ్రాట్ డాన్స్ చూసి మురిసిపోయిన తేజస్వి అతడిని ప్రత్యేకంగా అభినందించింది. 'నీ డాన్స్ చూసి మీ అమ్మా, నాన్నలే కాదు నేను కూడా చాలా గర్వపడుతున్నా' అంటూ అతడికి కితాబిచ్చింది

ఈ వారం టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను సినిమా తీయమని చెప్పారు. అమిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా నందిని, తనీష్, సామ్రాట్, దీప్తి సునైనా, కౌశల్ ముఖ్య పాత్రలో పోషించారు. సినిమాలో ఐటెం సాంగ్ కోసం దీప్తి సునైనా రెండు రోజులుగా 'రింగ రింగా' పాటకు డాన్స్ రిహార్సల్స్ చేస్తోంది.

తేజస్వి ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా పని చేసింది. కథ ప్రకారం సామ్రాట్ తో దీప్తి సునైనా డాన్స్ చేయాలి. బుధవారం ఎపిసోడ్ లో ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఈ ఐటెం సాంగ్ బిగ్ బాస్ హౌస్ కు మంచి ఎనర్జీ తీసుకొచ్చింది. దీప్తి సునైనా, సామ్రాట్ లు తమ మాస్ స్టెప్పులతో పాటకు పూర్తి న్యాయం చేశారు. సామ్రాట్ డాన్స్ చూసి మురిసిపోయిన తేజస్వి అతడిని ప్రత్యేకంగా అభినందించింది.

'నీ డాన్స్ చూసి మీ అమ్మా, నాన్నలే కాదు నేను కూడా చాలా గర్వపడుతున్నా' అంటూ అతడికి కితాబిచ్చింది. అంతేకాదు డాన్స్ చేస్తున్నంతసేపు తన కొడుకు డాన్స్ చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యానని సామ్రాట్ తో చెప్పింది. ఇద్దరూ చాలా క్యూట్ గా డాన్స్ చేశారని, బిగ్ బాస్ దాన్ని ఎలా ప్రెజంట్ చేస్తారో చూడాలని ఉందని చెప్పుకొచ్చింది. 

loader