బిగ్ బాస్2: అర్ధరాత్రి తనీష్-నందినిల రొమాన్స్

bigg boss2: tanish nandini's romance begins
Highlights

కెమెరాలు ఉన్నాయనే సంగతి మర్చిపోయి అందరూ పడుకున్నారా..? లేదా..? అని ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకొని అనంతరం తనీష్ దుప్పటిలోకి వచ్చి మరీ అతడిని కౌగిలించుకొని ముద్దు పెట్టింది నందిని

బిగ్ బాస్ సీజన్2 ఎపిసోడ్ 49లో నాని ఎప్పటిలానే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రతివారం లానే ఈవారం కూడా రాగానే కంటెస్టెంట్ లతో మాట్లాడారు నాని. ముందుగా తన స్టైల్ లో పిట్ట కథ చెప్పాడు. ఆ తరువాత రోల్ రైడా బిగ్ బాస్ హౌస్ మీద ర్యాప్ సాంగ్ రాసి పాడాడు. ఎలిమినినేషన్ విషయంలో ముందు నుండి ఎంతగా చెబుతున్నా.. కంటెస్టెంట్లు మాత్రం స్ట్రాంగ్ రీజన్ లేకుండా ఎలిమినేషన్ కు హౌస్ మేట్స్ ను నామినేట్ చేస్తున్నారని నాని అన్నారు.

ఇక హౌస్ లో తనీష్-నందిని ల మధ్య జరుగుతోన్న ట్రాక్ పై కొన్ని కామెంట్స్ చేశాడు నాని. 'కన్నా నువ్వు సునైనాను పాంపరింగ్ చేయొద్దని అమ్మ చెబితే నువ్వు ఇంకొకరితో టాంపరింగ్ చేయమని కాదు' అంటూ నందినిని ఉద్దేశించి తనీష్ కు చురకలు అంటించారు. నాని ఇలా అనడానికి బలమైన కారణాలు చాలానే ఉన్నాయి. కొద్దిరోజుల నుండి తనీష్-నందిని తమ మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

కెమెరాలు ఉన్నాయనే సంగతి మర్చిపోయి అందరూ పడుకున్నారా..? లేదా..? అని ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకొని అనంతరం తనీష్ దుప్పటిలోకి వచ్చి మరీ అతడిని కౌగిలించుకొని ముద్దు పెట్టింది నందిని. తనీష్ కూడా ఆమెను ముద్దు పెట్టుకోవడంతో వీరిద్దరి మధ్య కొత్త లవ్ ట్రాక్ మొదలైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.     

loader