బిగ్ బాస్2: సునైనాతో క్లోజ్ గా ఉండకు.. తనీష్ కు అమ్మ మాట

bigg boss2: tanish mother about deepthi sunaina
Highlights

తనీష్ తల్లి అతడు సునైనాతో క్లోజ్ గా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'నువ్వు క్లోజ్ గా ఉండడం, బ్రతిమిలాడడం, ముద్దు చేయడం, తినిపించడం వంటి విషయాలు నీ ఫాన్స్ కి నచ్చడం లేదు' అంటూ ఆమె చెప్పడంతో తనీష్ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ మొత్తం మారిపోయాయి

ఆరు వారాలకు పైగా కుటుంబానికి దూరంగా ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఇంటి సభ్యులతో మాట్లాడే ఒక అవకాశాన్ని ఇచ్చారు. హౌస్ మేట్స్ ఫోన్ లో మాట్లాడడానికి హౌస్ లో ఫోన్ ఎరేంజ్ చేశారు. అవతలి వ్యక్తి హింట్ ను బట్టి హౌస్ లో ఆ ఫోన్ కాల్ ఎవరికీ వచ్చిందో కనిపెట్టి వాటికి ఫోన్ ఇవ్వాలి. గుర్తుపట్టకపోతే.. ఆ ఫోన్ కట్ అయిపోతుంది. ఈ క్రమంలో ముందుగా కౌశల్ తన భార్యాబిడ్డలతో మాట్లాడాడు.

అలానే సామ్రాట్, రోల్ రైడాలు తమ ఇంటి సభ్యులతో మాట్లాడారు. దీప్తి సునైనాకు ఫోన్ వచ్చింది కానీ తన తండ్రి పేరు చెప్పేయడంతో కాల్ కాస్త కట్ అయిపోయింది. దీంతో ఆమె బాధ పడుతుంటే అమిత్ వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఫోన్ ఎవరికి వస్తుందనే విషయాన్ని ప్రోమోగా విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. దీప్తి నల్లమోతు, గీతామాధురిలతో పాటు తనీష్ కు ఫోన్ వచ్చింది.

తనీష్ తల్లి అతడు సునైనాతో క్లోజ్ గా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'నువ్వు క్లోజ్ గా ఉండడం, బ్రతిమిలాడడం, ముద్దు చేయడం, తినిపించడం వంటి విషయాలు నీ ఫాన్స్ కి నచ్చడం లేదు' అంటూ ఆమె చెప్పడంతో తనీష్ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ మొత్తం మారిపోయాయి. ఈ ప్రోమోతో ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగుతుందనే అనిపిస్తుంది. 

 

loader