బిగ్ బాస్ సీజన్2 లో నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో కౌశల్, తనీష్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనీష్.. సునైనాకి ఇచ్చే విలువ అమ్మ అని పిలిచే దీప్తికి ఎందుకు ఇవ్వడం లేదని కౌశల్ ప్రశ్నించడంతో ఆ టాపిక్ కాస్త మరెక్కడికో వెళ్లి ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునేలా చేసింది.

ఆ తరువాత తనీష్.. కౌశల్ ప్రవర్తన గురించి అమిత్ తో చర్చిస్తూ.. మీరు ఇలా ఆడితే జనాల ఆదరణ ఉండదని ఆయనెలా అంటారు అంటూ తనీష్.. కౌశల్ పై అసహనం వ్యక్తం చేశారు. మరిన్ని విషయాలు అమిత్ తో షేర్ చేస్తూ..  ''ఈరోజు ఫ్యాన్ కాల్ వచ్చింది అందులో నాది, సామ్రాట్ ల బాండ్ అలానే నీది రోల్ ల మధ్య బాండ్ గురించి బాగా చెప్పారు.. సో.. జనాలకి మన మధ్య ఉన్న బాండింగ్ నచ్చుతుంది. ఆ ప్రేమే జనాలకు కావాలేమో కదా.. అది కౌశల్ కి తప్పని ఎలా అనిపిస్తుంది.

ఫోన్ కాల్ లో కౌశల్ గురించి మాట్లాడడం లేదని ఆయనకి ఎక్కడో ఉంటుంది కదా.. అప్పుడైనా అర్ధం కావాలి కదా నా ఆలోచన తప్పని. టాస్క్ లకి మొత్తం బిగ్ బాస్ హౌస్ కి రిలేషన్ పెడుతున్నాడు. జనాలు గేమ్ ని గేమ్ లా చూస్తున్నారు.. బాండ్ ని బాండ్ ల చూస్తున్నారు  కానీ కౌశల్ మాత్రం బాండ్ కారణంగా గేమ్ సరిగ్గా ఆడడం లేదని నిరూపించాలనుకుంటున్నాడు'' అంటూ డిస్కస్ చేశారు.