బిగ్ బాస్2: వేరే ట్యాగ్స్ ఏవి అంటించుకోకు.. సామ్రాట్ కు వార్నింగ్

bigg boss2: sweet warning to samrat
Highlights

బిగ్ బాస్ సీజన్ 2లో సామ్రాట్-తేజస్వి ఎపిసోడ్ బాగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే. తేజస్వి హౌస్ లో ఉన్నంత కాలం ఇదే టాపిక్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరిగేవి. ఆదివారం ఎపిసోడ్ లో తేజస్వి బయటకు వెళ్లిపోయింది.

బిగ్ బాస్ సీజన్ 2లో సామ్రాట్-తేజస్వి ఎపిసోడ్ బాగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే. తేజస్వి హౌస్ లో ఉన్నంత కాలం ఇదే టాపిక్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరిగేవి. ఆదివారం ఎపిసోడ్ లో తేజస్వి బయటకు వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోతున్న సమయంలో సామ్రాట్ చాలా ఎమోషనల్ అయినప్పటికీ సోమవారం ఎపిసోడ్ నుండి మళ్లీ గేమ్ లోకి వచ్చేశాడు.

మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో సామ్రాట్ తన తల్లితో మాట్లాడాడు. ఆమె సామ్రాట్ పై ప్రేమ కురిపిస్తూనే స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ''గెడ్డం తీశాక నువ్వు చాలా బాగున్నావు. బాగా సన్నగా అయిపోయావు. రాత్రిపూట స్విమ్మింగ్ చేస్తూ ఆరోగ్యం పాడుచేసుకోకు.. హౌస్ లోకి ఎందుకు వెళ్ళావో.. అది గుర్తుంచుకో.. ఒకరితోనే నువ్వు కనెక్ట్ అవ్వడం వలన బయట బాగా నెగెటివ్ టాక్ వచ్చేసింది. నిన్ను మేము అర్ధం చేసుకోగలం కానీ ప్రజలు చేసుకోలేరు. అందరితో సమానంగా ఉండు. వేరే ట్యాగ్స్ ఏవి అంటించుకోకు. నీ గురించి నెగెటివ్ గా వినడం మాకు ఇష్టం లేదు'' అని సామ్రాట్ తల్లి చెప్పగానే.. అతడు బాగా సైలెంట్ అయిపోయాడు. ఇదే విషయాన్ని  తనీష్ తో షేర్ చేసుకున్నాడు. 
 

loader