బిగ్ బాస్2: గీతామాధురికి ఎలిమినేషన్ ఉండదా?

bigg boss2: rumours on geethamadhuri
Highlights

బిగ్ బాస్2 లో తనీష్, తేజస్వి వంటి తారలు ఉన్నప్పటికీ ఆరంభంలో గీతామాధురి పేరు బాగా హైప్ అయింది. దానికి కారణం ఆమె రెమ్యునరేషన్. ఈ షో కోసం ఆమె 15 నుండి 20 కోట్ల వరకు చార్జ్ చేస్తోందని తెలుస్తోంది. మిగిలిన హౌస్ మేట్స్ కు  వారు సినిమా కోసం రోజుకి ఎంత తీసుకుంటారో దానికి కొంత మొత్తం యాడ్ చేసి మాత్రమే ఇస్తున్నారు.

బిగ్ బాస్2 లో తనీష్, తేజస్వి వంటి తారలు ఉన్నప్పటికీ ఆరంభంలో గీతామాధురి పేరు బాగా హైప్ అయింది. దానికి కారణం ఆమె రెమ్యునరేషన్. ఈ షో కోసం ఆమె 15 నుండి 20 లక్షల వరకు చార్జ్ చేస్తోందని తెలుస్తోంది. మిగిలిన హౌస్ మేట్స్ కు  వారు సినిమా కోసం రోజుకి ఎంత తీసుకుంటారో దానికి కొంత మొత్తం యాడ్ చేసి మాత్రమే ఇస్తున్నారు. కానీ గీతామధురికి మాత్రం అలా కాదు. హౌస్ లో అందరికంటే ఆమె రెమ్యునరేషనే ఎక్కువ అని సమాచారం.

నిజానికి గీతా ఈ హౌస్ లోకి రావడం కోసం అమెరికాలో పాల్గొనాల్సిన మూడు, నాలుగు షోలను డుమ్మా కొట్టాల్సివచ్చిందట. దానికోసమే అమ్మడు ఈ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేసిందని అంటున్నారు. అయితే ఈ కారణంగానే ఆమెను హౌస్ లో ఎలిమినేట్ కాకుండా సేవ్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో నియమాలు ఎవరైనా పాటించకపోతే చర్యలు కఠినంగానే ఉంటాయి. ఈ విషయంలో బిగ్ బాస్ గీతామాధురిని తరచూ వార్న్ చేస్తూ వస్తున్నాడు.

తాజాగా ఆమెను జైలుకి కూడా పంపించాడు. కానీ అది అంత సీరియస్ శిక్షలా ఎవరికీ అనిపించలేదు. పైగా ఆమెను ఎక్కువ సమయం కూడా జైలులో ఉంచలేదు. టాస్క్ ల దగ్గరకి వచ్చేసరికి ఆమెకు సూపర్వైజ్ చేసే ఛాన్సే ఎక్కువగా ఇస్తున్నారు. దీంతో ఆమె ఎప్పుడూ కూడా బిగ్ బాస్ హౌస్ లో కాపాడబడుతూ వస్తోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కారణంగానే ఆమె ఎలిమినేట్ అవ్వకుండా చూసుకుంటున్నారని ఈ షోపై కామెంట్లు వినిపిస్తున్నాయి.   

loader