ప్రముఖ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 రాను రాను రసవత్తరంగా మారుతోంది. సీజన్ మొదలైనప్పుడు నాని హోస్టింగ్ బాలేదని, కంటిస్టెంట్స్ బాలేదంటూ అందరూ పెదవి విరిచారు. కానీ 16 రోజులు గడిచే సరికి  అందరికీ బిగ్ బాస్ పై ఆసక్తి బాగా పెరిగింది. 

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. హౌజ్ లోని తేజశ్వి, సామ్రాట్ ల మధ్య ఏదో కథ నడుస్తున్నట్లుగా కనపడుతోంది. మొదటి సీజన్ లో అందరూ స్నేహితుల్లాగే మెలిగారు. కానీ ఈ సెకండ్ సీజన్ లో లవ్ యాంగిల్ కూడా బయటకు వస్తుందని పలువురు భావిస్తున్నారు. దీనికి బలాన్ని చేకూరుస్తూ తేజశ్వి, సామ్రాట్ లు ప్రవర్తిస్తున్నారు.

సోమ‌వారం ఎపిసోడ్‌లో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. హౌస్‌మెట్స్‌కు దూరంగా గుసగులాడటం.. ఒకరి మీద ఒకరు పడటం, తినిపించుకోవడం, నువ్ చూపించే ప్రేమ కళ్లల్లో కనిపిస్తుందని సామ్రాట్‌కు హగ్ ఇవ్వడం చూస్తే వీరిద్ద‌రి మ‌ధ్య తెలియ‌ని ఆక‌ర్ష‌ణ ఏదో మెల్ల‌గా మొద‌లైంద‌నే అభిప్రాయం అంద‌రిలో క‌లుగుతుంది. రానున్న ఎపిసోడ్స్‌లో వీటిపై ఓ క్లారిటీ రానుంద‌ని అంటున్నారు.