బిగ్ బాస్2: కౌశల్ కు చెక్ పెట్టనున్నారా..?

Bigg Boss2: Plan On Koushal To Eliminate
Highlights

సామ్రాట్, తనీష్ లు కూడా ఆరంభంలో కౌశల్ ను టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు అతడిని కాపాడడానికి కౌశల్ ఆర్మ్ సిద్ధమైంది. అతడిని నామినేషన్ లో ఉన్నప్పుడు సేవ్ చేయడంతో పాటు అతడికి హౌస్ లో వ్యతిరేకంగా ఎవరు కామెంట్స్ చేసినా.. ఎలిమినేట్ అయ్యే విధంగా చేస్తున్నారు. 

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఎక్కువ ఓట్లు సాధించి హౌస్ లో విజేతగా నిలుస్తారు. లేదంటే ఎలిమినేషన్ లో బయటకు వచ్చేస్తారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అయితే హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు సైలెంట్ గా కనిపించిన కౌశల్ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో హీరో అయిపోయాడు. ముఖ్యంగా భానుశ్రీ, తేజస్విలు కౌశల్ పై ప్రవర్తించి తీరుతో ఆయనకు ప్రేక్షకుల్లో ఆదరణ బాగా పెరిగింది. సామ్రాట్, తనీష్ లు కూడా ఆరంభంలో కౌశల్ ను టార్గెట్ చేశారు.

అయితే ఇప్పుడు అతడిని కాపాడడానికి కౌశల్ ఆర్మ్ సిద్ధమైంది. అతడిని నామినేషన్ లో ఉన్నప్పుడు సేవ్ చేయడంతో పాటు అతడికి హౌస్ లో వ్యతిరేకంగా ఎవరు కామెంట్స్ చేసినా.. ఎలిమినేట్ అయ్యే విధంగా చేస్తున్నారు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన తేజస్వి వెళ్లిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. దానికి కారణం కూడా కౌశల్ ఆర్మీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తేజస్విని హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎలాగో జరుగుతున్నాయి కానీ అలానే కౌశల్ ను ఎలిమినేట్ అయ్యే విధంగా కూడా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

అతడిని బయటకి పంపించి కౌశల్ సేనను కంట్రోల్ చేయకపోతే హౌస్ మొత్తం అతడి కంట్రోల్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే కౌశల్ ను కార్నర్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. హౌస్ లో అందరూ కూడా కౌశల్ కు వ్యతిరేకంగా ఉన్నారు. బాబు గోగినేని అయితే అతడు ఈ హౌస్ కు చాలా డేంజర్, వీలైనంత తొందరగా వెళ్ళిపోతే బావుంటుందని అన్నారు. ఓటింగ్స్ బట్టి చూస్తే కౌశల్ కు మంచి నెంబర్ కనిపిస్తుంది. తనంతట తాను స్వయంగా బయటకు వెళ్తే తప్ప కౌశల్ ను బయటకు పంపాలంటే అంత సులువైన విషయం కాదు. సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోవడానికి కౌశల్ అంత వీక్ కంటెస్టెంట్ కూడా కాదు.. మరి ఏం జరుగుతుందో చూడాలి!
 

loader