బిగ్ బాస్2: కౌశల్ కి ఫోన్ కాల్.. ఎవరినీ నమ్మొద్దని చెప్పిన భార్య

bigg boss2: phone call to kaushal
Highlights

బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఇందులో ఓ మెలిక కూడా పెట్టారు.

బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఇందులో ఓ మెలిక కూడా పెట్టారు. ఫోన్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తి క్లూ చెప్తారు.. ఆ క్లూ కనిపెట్టి అది ఎవరికి వచ్చిందో వారికి ఫోన్ ఇవ్వాలి.

అవతలి వ్యక్తి క్లూ చెప్పకపోయినా, ఫోన్ ఎత్తివారు క్లూ సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయినా.. ఫోన్ కట్ అవుతుంది. ఈ క్రమంలో ముందుగా గీతామాధురి ఫోన్ ఎత్తగా కౌశల్ భార్య చెప్పిన క్లూ గుర్తుపట్టి అతడికి ఫోన్ ఇచ్చేసింది. కౌశల్ తన భార్య, పిల్లలతో మాట్లాడి ఎమోషనల్ అయ్యాడు. కౌశల్ భార్య మీరు ఎంతో అభిమానం పొందారని, అలాగే గేమ్ ఆడమని సూచించింది.

అలానే హౌస్ లో మీరు కొందరికి మంచి చెబుతున్నా వారు చెడుగా  అర్ధం చేసుకుంటున్నారని నందిని పేరు చెప్పింది. ఆమెతో మాట్లాడినంతసేపు కౌశల్ ఎమోషనల్ అయ్యాడు. తన కొడుకు ఐ లవ్ యూ పప్పా ఆల్ ది బెస్ట్ అని చెప్పగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు కౌశల్. 

loader