బిగ్ బాస్ సీజన్2 లో 63వ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. 'పైసా పైసా' అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాని ఎప్పటిలానే పంచ్ లు, చీవాట్లుతో కార్యక్రమాన్ని నడిపించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఒక్కో కంటెస్టెంట్ తో మాట్లాడిన నాని.. తనీష్ కి పెద్ద క్లాస్ తీసుకున్నారు. కెప్టెన్ అయ్యే అర్హత నీకుందనే అనుకుంటున్నావా అంటూ అతడిని ప్రశ్నించారు. 'అంతిమయుద్ధం' టాస్క్ లో నీ అంతటా నువ్వు ఆది గెలిచింది ఒక్క గేమ్ కూడా లేదు.

అలాంటిది నువ్ ఎలా కెప్టెన్ అయ్యావని నాని ప్రశ్నించడంతో తనీష్ తడబడ్డాడు. గోల్డ్ కాయిన్స్ దొంగిలించాడని కౌశల్ ని నిందించినప్పుడు.. పూజ విసిరేసిన కాయిన్స్ ను నువ్వు ఎలా తీసుకుంటావని ప్రశ్నించారు నాని. ఒక్క తనీష్ ని మాత్రమే కాకుండా.. అసలు ఒక్క గేమ్ లో కూడా గెలవని తనీష్ ని కెప్టెన్ గా ఎలా ఎంపిక చేశారంటూ పురుషుల టీమ్ కి క్లాస్ పీకారు.

అలానే కెప్టెన్ టాస్క్ లో సంచలకురాలుగా ఉండటానికి నీకు ఉన్న అర్హత ఏంటి..? అంటూ దీప్తి సునయనను సూటిగా ప్రశించారు నాని. తనీష్ తో నీ స్నేహం గురించి అందరికీ తెలుసు అతడు కెప్టెన్ రేస్ లో ఉన్నప్పుడు నువ్వు సంచాలకురాలుగా ఉంటే తనీష్ కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటావని ఎలా అనుకుంటారు అంటూ చురకలు అంటించారు.