బిగ్ బాస్2: ఎవరిని పంపించాలో మీరు డిసైడ్ చేసేదేంటి.. బాబుపై నాని ఫైర్

bigg boss2: nani fires on babu gogineni
Highlights

హౌస్ నుండి కౌశల్ ను పంపించేయాలని ఏదో ప్లాన్ చేయాలనీ మాట్లాడుకుంటున్నారు. హౌస్ నుండి ఎవరిని పంపించాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు. మీరు న్యాయకత్వ లక్షణాల గురించి క్లాసెస్ చెబుతారేమో కానీ నాయకులను తయారు చేసేది మాత్రం ప్రజలు

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో బాబు గోగినేని కెప్టెన్సీ టాస్క్ పూర్తయిన తరువాత గీతామాధురిపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. బాబు గోగినేని మాట్లాడిన తీరుతో గీత కంటతడి కూడా పెట్టుకున్నారు. శనివారం కోసం తను ఎదురుచూస్తున్నట్లు ఈ గొడవ విషయంలో నాని ఏం మాట్లాడతారో వినాలనుందని దీప్తితో అన్నారు గీతా. ఆమె ఆశించినట్లుగానే నాని.. గీతా మాట్లాడిన ఒక్క మాటల్లో కూడా తప్పులేదని ఆమెను సమర్ధించారు.

'మీరు ఓపెన్ అయితే హౌస్ లో ఇలా ఉంటారా..? ఇలా అయితే మీరేం ఓపెన్ అవ్వకండి' అంటూ బాబుకి చురకలు అంటించారు. గీతా విషయంలో ఆమె కరెక్ట్ గానే వ్యవహరించారని మీరు రియాక్ట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచిందంటూ బాబు గోగినేనిని ఉద్దేశిస్తూ నాని కామెంట్స్ చేశారు. స్థాయి గురించి బాబు గోగినేని తనను గొప్పగా చెప్పుకోవడం పట్ల నాని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక హౌస్ లో రాజమౌళి టాపిక్ తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తూ.. రాజమౌళి నాస్తికుడైనా తన కుటుంబం కోసం మంత్రాలయంకి వెళ్లి ఉంటారని ఆయన గురించి మీరెలా కామెంట్ చేస్తారంటూ నాని కాస్త ఘాటుగా స్పందించారు.

అక్కడితో టాపిక్ వదిలేద్దామని చెప్పిన నాని చివరగా గోగినేనికి ఒక పంచ్ వేశారు. 'హౌస్ నుండి కౌశల్ ను పంపించేయాలని ఏదో ప్లాన్ చేయాలనీ మాట్లాడుకుంటున్నారు. హౌస్ నుండి ఎవరిని పంపించాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు. మీరు న్యాయకత్వ లక్షణాల గురించి క్లాసెస్ చెబుతారేమో కానీ నాయకులను తయారు చేసేది మాత్రం ప్రజలు. వాళ్లు మాత్రమే డిసైడ్ చేస్తారు ఈ హౌస్ నుండి ఎవరు వెళ్లాలో' అంటూ బాబు గోగినేనిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 

loader