Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: ట్రోలింగ్ పై నాని కామెంట్!

బిగ్ బాస్ సీజన్2 చివరి దశకు చేరుకుంటుంది. అయితే మొదటినుండి కూడా ఈ షోపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అవి మరి కాస్త ఎక్కువయ్యాయనే చెప్పాలి

bigg boss2: nani break silence on trolls
Author
Hyderabad, First Published Sep 4, 2018, 2:50 PM IST

బిగ్ బాస్ సీజన్2 చివరి దశకు చేరుకుంటుంది. అయితే మొదటినుండి కూడా ఈ షోపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అవి మరి కాస్త ఎక్కువయ్యాయనే చెప్పాలి. హోస్ట్ నానిపై కూడా సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నాని హౌస్ లో కొందరితో మాత్రమే సఖ్యతగా ఉంటున్నాడని, పక్షపాతం చూపిస్తున్నాడనే మాటలు ఎక్కువయ్యాయి.

ఇది స్క్రిప్టెడ్ గేమ్ అని.. తమకు నచ్చిన వారినే బిగ్ బాస్ విజేతగా ప్రకటించనున్నారని దానికి హోస్ట్ నాని కూడా సపోర్ట్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించాడు నాని. బిగ్ బాస్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ చూశాను. నేను మీకు స్పందించాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ బృందం నాకు చెప్పినప్పటికీ రిప్లయ్ ఇవ్వకుండా ఎలా ఉండగలను. ఇదే షోకి సంబంధించి నా చివరి ప్రకటన అంటూ ఓ పోస్ట్ పెట్టాడు నాని.

''షో విషయంలో మీలో కొందరు నా వల్ల బాధపడి ఉంటే క్షమించండి. కానీ మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. మీకు ఇష్టమైన హౌస్ మేట్ ని ఎప్పుడు ప్రత్యేకంగా చూసుకోవాలని భావిస్తున్నారు. కానీ హోస్ట్ గా నేను మీలా ఆలోచించలేను. నా వైపు నుండి అందరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి. మీరు హౌస్ లో ఒకరికి అభిమాని అయి ఉండొచ్చు అయితే నేను హౌస్ లో అందరికీ సమానంగా ఛాన్స్ ఇస్తున్నప్పుడు మీకు నేను పక్షపాతం చూపిస్తున్నానని అనిపించొచ్చు.

కానీ నన్ను నమ్మండి నాకు హౌస్ లో అందరూ సమానమే. మీ ఆదరణతోనే హౌస్ లో ఉత్తమ వ్యక్తి విజయం సాధిస్తారు. ఓటింగ్, ఎలిమినేషన్ విషయాలని నేను చూసుకుంటున్నాని మీరు అనుకుంటున్నారు. నిజంగా అందులో నా ప్రమేయం ఉంటుందనే భావిస్తున్నారా..? ఇక ఆ విషయాన్ని మీకే వదిలేస్తున్నాను. నటుడిగా, వ్యాఖ్యాతగా మీకు బెస్ట్ ఇవ్వాలనేది నా ఆలోచన.

నన్ను ప్రేమించినా, ద్వేషించినా మీ అందరూ నా కుటుంబ సభ్యులే. మీరు నన్ను అపార్ధం చేసుకుంటే ఆ ఇంపాక్ట్ నాపై అట్నుండి. కానీ అది నన్ను కింద పడేస్తుందా..? లేదు.. ఇంకా బెటర్ గా చేయడానికి ప్రయత్నిస్తాను'' అంటూ రాసుకొచ్చాడు.    
 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: ఆ నలుగురిలో వెళ్లేదెవరు..?

బిగ్ బాస్ షోపై నటి మాధవీలత ఫైర్!

బిగ్ బాస్2: ఎలిమినేషన్ ట్విస్ట్.. నూతన్ ఔట్!

బిగ్ బాస్2: నూతన్ నాయుడు ఎలిమినేట్ కానున్నాడా..?

బిగ్ బాస్2: సామాన్యుడు గణేష్ ఔట్!

Follow Us:
Download App:
  • android
  • ios