బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రేక్షకాదరణ దక్కుతోంది. సీజన్ 1కి మంచి సక్సెస్ రేటింగ్స్ వచ్చాయి. ఇప్పుడు సీజన్ 2 కి కూడా ప్రేక్షకులు అడిక్ట్ అయిపోయారు. దానికి తగ్గట్లే షోని మరింత రసవత్తరంగా నడిపించడానికి బిగ్ బాస్ సరికొత్త టాస్క్ లను కంటెస్టెంట్ లకు ఇస్తున్నారు. మొదటినుండి కూడా హౌస్ లో కౌశల్ ని అందరూ సెపరేట్ చేసి చూస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే కౌశల్ కి వ్యతికరేకంగా కామెంట్స్ చేసినా.. ఆయనపై ఆరోపణలు చేస్తున్నా వారిని బయటకి పంపించే విధంగా కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపైన్ నిర్వహిస్తోంది. దానికి తగ్గట్లే ఒక్కొక్కరి ఎలిమినేషన్ కూడా జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈసారి కౌశల్ ని మొదటి నుండి ఇబ్బంది పెడుతోన్న బాబు గోగినేని బయటకి వచ్చేలా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో కౌశల్ కూడా బాబు గోగినేని పై అసహనంతో ఉన్నట్లు వ్యక్తమైంది.

బిగ్ బాస్ కంటే బాబు గోగినేని ఎక్కువ అన్నట్లు ఆయన ఫీల్ అవుతుంటారని మండిపడ్డాడు కౌశల్. ఆయనకంటే ఎక్కువ తెలుసా అంటూ ప్రశ్నించాడు. మధ్యలో కలుగజేసుకున్న నూతన్ నాయుడు మరి మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా అని సూచించాడు. దీంతో కౌశల్ మనమేమైనా టీచర్లమా.. ఆయనకు తెలియదా అంటూ అడిగాడు. బయటకి ఇద్దరూ బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు.