అందరూ ఊహించినట్లుగానే ఆదివారం ఎపిసోడ్ లో దీప్తి సునైనా హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేట్ అవుతోందని తెలిసిన వెంటనే హౌస్ మేట్స్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తనీష్ అయితే కంటతడి పెట్టుకున్నారు. అయితే వెళ్లిపోతున్నప్పుడు సునైనా.. కౌశల్ కి సారీ చెప్పింది. కౌశల్ తో ఆమె ప్రవర్తించిన తీరుని ఉద్దేశిస్తూ అతడిని క్షమాపణలు కోరింది.

దానికి  నవ్వుతూ రియాక్ట్ అయ్యాడు కౌశల్. ఇదే ఆఖరి రోజు కదా ఇప్పుడైనా ఎత్తుకోవచ్చా అంటూ ఆమెను ఎత్తుకొని సెల్ఫీ తీసుకున్న సన్నివేశం షోకి హైలైట్ గా నిలిచింది. ఇక కౌశల్ ఆమెకు జాగ్రత్తలు చెబుతూ.. 'సునైనా నువ్వు జాగ్రత్త.. దేవుడి ఆశీస్సులు నీకు ఉంటాయి. ఇంటర్వ్యూలలో ఎవరైనా కాల్ సెంటర్ టాస్క్ గురించి అడిగినప్పుడు జాగ్రత్తగా సమాధానాలు చెప్పు. నేను కావాలని చేయలేదు తెలియకుండా జరిగిపోయిందని చెప్పు' అంటూ ఆమెకు సలహాలు ఇచ్చాడు.

ఇదంతా చూసిన అభిమానులు కౌశల్ గొప్పతనం గురించి చర్చించుకుంటున్నారు. అతడిని ఇష్టమొచ్చినట్లుగా కామెంట్స్ చేసిన సునైనాతో సైతం కౌశల్ ప్రేమగా మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. 

ఇవి కూడా చదవండి.. 

నెక్స్ట్ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ దేవరకొండ..?

బిగ్ బాస్2: నామినేషన్స్ లో తనీష్ షాక్ ఏంటో..?