Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: ఈ వారం వెళ్లిపోయేది ఆ ఇద్దరే!

అయితే ఈ వారం బయటకు ఎవరు వెళ్లబోతున్నారనే విషయంలో గణేష్, నందిని, బాబు గోగినేని పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ లో కౌశల్, దీప్తి. గణేష్, నందిని, బాబుగోగినేని ఉండగా.. ఓట్ల విషయంలో గణేష్, నందిని బాగా వెనకబడ్డారని సమాచారం. 

bigg boss2: ganesh, nandini will eliminate in this week

బిగ్ బాస్ సీజన్2 ఎలిమినేషన్ ప్రక్రియ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. నాని వచ్చే వారాంతంలో మాత్రం ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. నాని హౌస్ మేట్స్ ను ఏమంటారు..? హౌస్ లో నుండి ఎవరు బయటకు వెళ్లిపోతున్నారో తెలుసుకోవాలనే ఆతురత ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఇక ఈ వారం నుండి బిగ్ బాస్ హౌస్ నుండి ఇద్దరు చొప్పున బయటకు వచ్చేస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అలా చేయడం వలన చివరికి హౌస్ లో నలుగురు కంటెస్టెంట్లు మిగులుతారు. వారి నుండి ఒకరి బిగ్ బాస్ విజేతగా ప్రకటిస్తారు. చివరి వరకు ఎక్కువ మంది కంటెస్టెంట్లను ఇంట్లోనే ఉంచేస్తే సమస్యగా మారే అవకాశం ఉందని ఈ వారం నుండే ఇద్దరు, ఇద్దరుగా ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేయనున్నారు. అయితే ఈ వారం బయటకు ఎవరు వెళ్లబోతున్నారనే విషయంలో గణేష్, నందిని, బాబు గోగినేని పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ వారం ఎలిమినేషన్ లో కౌశల్, దీప్తి. గణేష్, నందిని, బాబుగోగినేని ఉండగా.. ఓట్ల విషయంలో గణేష్, నందిని బాగా వెనకబడ్డారని సమాచారం. కాబట్టి ఈ వారం వారిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలానే బాబు గోగినేని కేసుల విషయంలో ఇరుక్కోవడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గనుక అప్పుడు గణేష్ కానీ నందిని కానీ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios