బిగ్ బాస్2: అమ్మాయిల బాత్ రూంలో కౌశల్.. పూజా ఫైర్

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Aug 2018, 2:37 PM IST
bigg boss2: conversation between pooja and geethamadhuri about kaushal
Highlights

హౌస్ లో ఇన్ని బాత్ రూంలు ఉన్నా.. కౌశల్ మాత్రం మహిళల బాత్ రూంలే వాడుతున్నారు. పురుషులకు సెపరేట్ గా మహిళలకు సెపరేట్ గా బాత్ రూంలు ఉన్నా అతడు లేడీ వాష్ రూంలను వాడటం ఏంటి..? ఇది నాకు నచ్చట్లేదు

బిగ్ బాస్ సీజన్ 2 బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. హౌస్ లో కంటెస్టెంట్ లకు రకరాల టాస్క్ లను ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు బిగ్ బాస్. గురువారం ఎపిసోడ్ లో అంతిమయుద్ధం విజేతలుగా పురుషులు నిలిచారు. మహిళల దగ్గర కౌశల్ కాయిన్స్ దొంగతనం చేశాడంటూ కౌశల్ పై అందరూ మండిపడిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఎపిసోడ్ లో కూడా అది కంటిన్యూ అయింది.

ఈ నేపథ్యంలో కౌశల్ కి మిగిలిన కంటెస్టెంట్స్ కి మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోపక్క కౌశల్ అమ్మాయిల బాత్రూంలను వినియోగిస్తున్నాడంటూ పూజా.. గీతామాధురి వద్ద కంప్లైంట్ చేసింది. 'హౌస్ లో ఇన్ని బాత్ రూంలు ఉన్నా.. కౌశల్ మాత్రం మహిళల బాత్ రూంలే వాడుతున్నారు. పురుషులకు సెపరేట్ గా మహిళలకు సెపరేట్ గా బాత్ రూంలు ఉన్నా అతడు లేడీ వాష్ రూంలను వాడటం ఏంటి..? ఇది నాకు నచ్చట్లేదు' అంటూ గీతా వద్ద చెప్పింది.

ఇది మొదటిసారి కాదని గతంలో తేజస్విని కూడా ఇదే కంప్లైంట్ చేసిందని చెప్పిన గీతా.. కౌశల్ ని అడిగే ప్రయత్నం చేసింది. దానికి కౌశల్ నుండి సరైన సమాధానం రాకపోవడం మధ్యలోనే ఆ టాపిక్ వదిలేసి వెళ్లిపోయింది.  
 

loader