బిగ్ బాస్2: కౌశల్, తనీష్, బాబు గోగినేని.. గ్రిప్ కోల్పోతున్నారా..?

bigg boss2: Babu Gogineni, Tanish and now Kaushal are hurting their image themselves
Highlights

లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో కౌశల్ టీమ్ గెలిచినప్పుడు, ఆ వస్తువులను హౌస్ మేట్స్ తో షేర్ చేసుకుంటారా అని కొత్త కెప్టెన్ గీతామాధురి ప్రశ్నించినప్పుడు తన సమాధానం చెప్పకుండా.. టాస్క్ లో గెలిచినందుకు తనను ఇద్దరు హౌస్ మేట్స్ మెచ్చుకోలేదని తన వ్యక్తిగత విషయాన్ని అందరి ముందు డిస్కస్ చేసి తన స్థాయిని తగ్గించుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్2 పై రోజురోజుకి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. ఈ షో గురించి వారాంతంలో నాని చెప్పే విషయాల గురించి కంటెస్టెంట్ లతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. హౌస్ లో ఉన్నవారందరూ ఎవరికి తోచినట్లు వారు గేమ్ ఆడుతున్నారు. ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకున్న కొందరు కంటెస్టెంట్లు ఇప్పుడు తమ చేతులారా ఆ క్రేజ్ ను తగ్గించుకుంటున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందుగా బాబు గోగినేని గురించి చెప్పుకోవాలి. ఆరంభం నుండి ఎంతో హుందాగా, అందరికీ సలహాలు ఇస్తూ, నాలెడ్జ్ ను షేర్ చేస్తోన్న గోగినేని ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న కారణానో? మరొకటో? తెలియదు గానీ ఆయన ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరిచింది.

గీతామాధురిపై అయన విరుచుకుపడిన తీరు ఏ ఒక్కరికీ కూడా కరెక్ట్ అనిపించలేదు. ఈ విషయంలో ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ఒక్క చర్యతో ఆయన ప్రేక్షకుల అభిమానాన్ని కోల్పోతున్నారు. అలానే తనీష్.. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడనుకుంటే దీప్తి సునైనా, నందినిలతో సన్నిహితంగా ఉండడం, ఫ్లర్ట్ చేయడం కొందరికి రుచించడం లేదు. ఈ విషయంలో నాని అతడిని వారించినా, తనీష్ తల్లి 'ఛాన్స్ టు టాక్' సమయంలో అతడికి ఫోన్ లో చెప్పినా.. తనీష్ మాత్రం ఈ మాటలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ కూడా తనీష్ అందరితో కలవకుండా తన గ్రూపిజంను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.

నిన్నటి ఎపిసోడ్ తో కౌశల్ పై నెగెటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో కౌశల్ టీమ్ గెలిచినప్పుడు, ఆ వస్తువులను హౌస్ మేట్స్ తో షేర్ చేసుకుంటారా అని కొత్త కెప్టెన్ గీతామాధురి ప్రశ్నించినప్పుడు తన సమాధానం చెప్పకుండా.. టాస్క్ లో గెలిచినందుకు తనను ఇద్దరు హౌస్ మేట్స్ మెచ్చుకోలేదని తన వ్యక్తిగత విషయాన్ని అందరి ముందు డిస్కస్ చేసి తన స్థాయిని తగ్గించుకున్నాడు. చిన్నపిల్లల మాదిరి కంగ్రాట్స్ చెప్పలేదని కౌశల్ చేసిన ఆర్గ్యుమెంట్ ప్రేక్షకులకు రుచించలేదు. కౌశల్ అదే విషయాన్ని మరింత సాగదీయడంతో ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇలాంటి వ్యవహారమే హౌస్ లో కంటిన్యూ అయితే కౌశల్ మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. 

loader