గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో బుల్లితెర నటి వాసంతి కంటెస్టెంట్ గా పాల్గొంది. పద్దతిగా అచ్చతెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. వాసంతి చూడముచ్చటైన రూపానికి అంతా ఆకర్షితులు అయ్యారు.
గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో బుల్లితెర నటి వాసంతి కంటెస్టెంట్ గా పాల్గొంది. పద్దతిగా అచ్చతెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. వాసంతి చూడముచ్చటైన రూపానికి అంతా ఆకర్షితులు అయ్యారు. బిగ్ బాస్ తర్వాత వాసంతికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం వాసంతి 'గేమ్ ఆన్' అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ స్నేహితుడు గీతానంద్ హీరోగా నటిస్తున్నాడు. నేహా సోలంకి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర టీజర్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా లాంచ్ అయింది. బోల్డ్ రొమాన్స్, యాక్షన్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మాఫియా డ్రామా తరహాలో గన్స్, అమ్మాయిల అందం ఎక్కువగా కనిపిస్తోంది ఈ టీజర్ లో. ఇక వాసంతి పాత్ర అయితే నెటిజన్లకు బిగ్ షాక్ అనే చెప్పాలి. బిగ్ బాస్ లో ట్రెడిషనల్ గా కనిపించిన వాసంతి ఈ చిత్రంలో బోల్డ్ రోల్ తో షాకివ్వబోతోంది. టీజర్ లో ఆమె సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

'ఇది లవ్ చెప్పాల్సిన టైం కాదు.. లవ్ చేయాల్సిన టైం అంటూ' బోల్డ్ డైలాగులు చెబుతూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. టీజర్ లో ఇంటిమేట్ సన్నివేశాలు, లిప్ లాక్స్ ఉన్నాయి. వాసంతి కూడా గ్లామర్ తలుపులు తెరచి.. టాలీవుడ్ లో ఈ తరహా పాత్రలతో క్రేజ్ పొందాలని చూస్తోంది.
గీతానంద్ తమ్ముడు దయానంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ టీజర్ తో వాసంతి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ముందు వాసంతి ఇంకెలాంటి బోల్డ్ రోల్స్ చేయబోతోందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
