బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చివరిదశకు చేరుకుంటుంది. ఫైనల్ వీక్ కుదగ్గర పడుతుండటంతో..  కంటెస్టెంట్స్ మధ్య హోరా హోరీ పోరుతో పాటు..ఓ యుద్ద వాతావరణ నెలకొంది. టాస్క్ల విషయంలో ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.  

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు వచ్చింది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే.. హౌస్ లో ఉన్నవారిపై ప్రెజర్ పెరిగిపోతోంది. టెన్షన్ తో చిర్రెత్తిపోతున్నారు కంటెస్టెంట్స్. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. టాప్5 లోకి వెళ్లడానికి టికెట్ టు ఫినాలే అస్త్రా పేరుతో టాస్క్ ను స్టార్ట్ చేశారు బిగ్ బాస్. కొత్త టాస్క్ లతో కఠినమైన పరీక్షలు పెట్టబోతున్నాడు. ఈక్రమంలో హౌస్ లో మరోసారి యుద్ద వాతావరణం అలముకుంది. 

ఈక్రమంలో ఫినాలే అస్త్రాలో.. రకరకాల టాస్క్ లు పెడుతుండగా.. అందులో విన్ అయిన వారు ముందుకు వెళ్తున్నరాు. డ్రప్ అయిన వారు టికెట్ టూ ఫినాలే అస్త్రాకు దూరం అవుతున్నారు.అంటే టాప్ 5 లోకి వెళ్లే ఫస్ట్ కంటెస్టెంట్ గా ఛాన్స్ మిస్ అయినట్టే. అయితే మొత్తగా ఇప్పుడు జరిగిన టాస్క్ లను చూసకుుంటే.. ముందువరుసలో అమర్ ఉన్నారు. ఎవరూ దగ్గరకు చూడా చేరలేనన్ని పాయింట్స్ తో అమర్ టాప్ 5 లిస్ట్ లో ప్లేస్ కోసం దూసుకుపోతున్నాడు. అయితే ఈక్రమంలో ఇంకెవరైనా ఆప్లేస్ ను కొట్టేస్తారేమో అన్న భయం అమర్ లో ఉంది. అందుకే శివాజీని పక్కకుపిలిచి మీచేతుల్లోనే ఉంది అని ఏదో బేరం ఆడబోయాడు. అయితే తన చేతుల్లో ఏమీ లేదని.. ఏదైనా ఉంటే.. వారితో మాట్లాడుకోమన్నాడు శివాజీ.

ఇక కంటెస్టెంట్లు ఎవరికి వారు టాస్క్ ల గురించి..నామినేషన్లు గురించి రకరకాలుగా చర్చించుకుంటుండగా.. అందరు బద్దకంతో ఉన్నారని గుర్తించిన బిగ్ బాస్..వారిచేత రకరకాల పెర్ఫామెన్స్ లు చేయించి ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ను అందించే పని చేశారు. ఎవరికి తగ్గట్టు వారు ఎంటర్టైన్ చేశారు. అయితే .. టాస్క్ లో అన్నిప్రతీ రౌండ్ నుంచి బయటకు వెళ్ళేవారు.. వారి పాయింట్స్ ను ఎవరికైనా ఇవ్వచ్చు.. అయితే ప్రియాంక గేమ్ నుంచి బయటకు వెళ్తు తన పాయింట్స్ గౌతమ్ కు ఇచ్చింది. ఇక అక్కడ స్టార్ట్ అయ్యింది రచ్చ. 

తనకు పాయింట్స్ ఇవ్వకుండా గౌతమ్ కు పాయింట్స్ ఇవ్వడంతో అమర్ బాగా హార్ట్ అయ్యాడు. నేనువెదవనయ్యానంటూ.. బాధపడ్డాడు. ఇక వీరిద్దరిమధ్య గొడవలకు శోభ కాస్త మంట రగిలించి వదిలిపెట్టింది. ఒక రకంగా ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది శోభ. ఈ విషయంపై రకరకాల వాదనల తరువాత అమర్ కు క్షమాపణలు చెప్పింది ప్రియాంక. అయినా అమర్ సరిగ్గా మాట్లాడకపోయేసరికి ప్రియాంక బాధపడుతుంది. ఈమధ్యలో శోభ కవర్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది. 


శోభ చాలా సర్కాస్టిక్ గా మాట్లాడటం, చేసే పనులు కూడా అలానే ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రియాంక మధ్యలో నలిగిపోతోంది. ఇక ఫైనల్ గా అమర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. అర్జున్ సెకండ్, గౌతమ్ మూడోవ స్థానంలో.. ఉన్నారు. ఇక టికెట్ టూ ఫినాలే కు ఎవరు వెళ్తారో చూడాలి.