Asianet News TeluguAsianet News Telugu

#TelanganaElections2023: బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. ప్రస్తుతం ఎలక్షన్స్ లో ఎలా ఓటు వేస్తారు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. సామాన్యులు.. సెలబ్రిటీలు ఎన్నికల్లో ఓటు వేయడానికి పోటీ పడ్డారు. ఈక్రమంలో కింగ్ నాగార్జున తన ప్యామిలీతో కలిసి ఎటు వేయడానికి ఉదయం వచ్చారు.. అయితే నాగ్ వచ్చారుసరే.. మరిఆయ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఓటువేయడం ఎలాగా..?

Bigg Boss Telugu Season 7 Contestants How To Cast Vote JMS
Author
First Published Nov 30, 2023, 3:55 PM IST

తెలంగాణాలో పోలింగ్ జోరుగా సాగుతోంది హైదరాబాద్ మినహా.. తెలంగాణ అంతటా ఓటర్ విప్లవం కొనసాగుతోంది. చాలా జిల్లాల్లో 85 శాతానికి పైగా ఓటింగ్ 3 గంటలవ వరకూ నమోదు అయ్యింది. మునుపటికంటే ఈసారి పర్సంటేజ్ పెరిగే అవకాశంకనిపిస్తోంది. అయితే హైదరాబాద్ లో మాత్రం ఓటర్లు ఇంటి నుంచి బయటకు రావడంలేదు. ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. హైదరాబాద్ అంతటా హాలీడే మూడ్ లో ఉన్నారు జనాలు. ఈక్రమంలో ఓటింగ్ కు సబంధించి ఓన్యూస్ వైరల్ అవుతోంద.ి 

ఓటు వేసేందుకు ఉదయాన్ని సామాన్యుల కంటే కూడా సెలబ్రిటీలు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈక్రమంలో కింగ్ నాగార్జున తన ఫ్యామిలీతో వచ్చి.. ఓటు వేయగా..ఆయనను చూసిన జనాలకు ఓ అనుమానం స్టార్ట్ అయ్యింది. నాగ్ ఓటు వేశారు సరే.. మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారి సంగతేంటి. వారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారు. వారికి ఏదైనాఆప్షన్ ఉంటుందా...? ప్రస్తుతం ఇదే ప్రశ్న అందరిని వెంటాడుతుంది. 

పోలింగ్ కేంద్రం వద్ద చిరంజీవి కామెడీ, మెగాస్టార్ కామెడీ టైమింగ్ అదుర్స్ అంటున్న అభిమానులు, ఇంతకీ ఏమంటున్నారంటే

 తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఫినాలేకి చేరువలో ఉంది. ప్రస్తుతం టికెట్ టూ ఫినాలే అంటూ మొదటి ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేసే ప్రక్రియ నడుస్తుంది. దీంతో రెండు రోజులు నుంచి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ పెడుతూ వస్తున్నాడు బిగ్‌బాస్. ఇక ఫైనల్ కి చేరుకునేందుకు కంటెస్టెంట్స్ కూడా టాస్క్ లో టఫ్ కంపిటేషన్ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో అమర్, శివాజీ, గౌతమ్, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, శోభా శెట్టి.. ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కాగా నేడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి వీరు ఎలా ఓటు వేయాలి..? 

ఉదయాన్నే కదిలిన సెలబ్రిటీలు, ఓటు వేసిన మెగాస్టార్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ రాజమౌళి..

ఇక ప్రతి ఒకరు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు.ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనల్ రెండు వారాల దూరంలో ఉంది. ఈ సమయంలో కంటెస్టెంట్స్ ని బయటకి తీసుకు రావడం అనేది కష్టమే అని తెలుస్తుంది. మరి కంటెస్టెంట్స్ తమ ఓటు హక్కుని ఎలా ఉపయోగించుకుంటారు. సాధారణంగా.. ప్రభుత్వం లేదా ఇతర ప్రత్యేక విధుల్లో భాగంగా బయటకి వెళ్లి పోలింగ్ బూత్ కి దూరంగా ఉన్నవారికి.. ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా తమ ఓటుని వేసే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఈక్రమంలోనే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కూడా కల్పిస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారానే వారు ఓటు వేసి ఉంటారు అని అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios