Asianet News TeluguAsianet News Telugu

శ్రీసత్య వల్ల లక్ష రూపాయలు లాస్ అయిన కంటెస్టెంట్స్, దెయ్యాల గదిలో ఇనయా, ఏమాత్రం భయపడని రేవంత్

దెయ్యాం టాస్క్ తో దడదడలాడిస్తున్నాడు బిగ్ బాస్. ముందు ఆదిరెడ్డి, శ్రీహాన్ లను భయపెట్టిన ఆయన.. ఈరోజు శ్రీసత్యకు చుక్కలు చూపించాలనుకున్నాడు. కాని ఆమె తప్పించుకోవడంతో.. ఇనయా , రేవంత్ లు బలైపోయారు. 
 

Bigg Boss Telugu Season 6 95Th Day
Author
First Published Dec 9, 2022, 12:04 AM IST

బిగ్ బాస్ హౌస్  చివరి దశకు వచ్చింది. ఇక  ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా  చివరి దశకి వచ్చేసరికి దెయ్యం టాస్క్ లతో హడలెత్తించాడు.  ఇందులో భాగంగా హౌస్ లో వివిధ రకాలైన సౌండ్స్, విచిత్రమైన నవ్వుతో భయపెడుతుంటాడు. ఈసారి కూడా హౌస్ మేట్స్ ని హడలెత్తిస్తున్నాడు బిగ్ బాస్. దెయ్యం టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు కన్ఫెషన్ రూమ్ లో చీకటి గదిలోకి  పిలిచి అక్కడ వస్తువులు కనుగొనే టాస్క్ పెడుతున్నాడు. ఇందులో బాగంగా వాళ్ళను హడలెత్తిస్తున్నాడు. 

ఇలా చేయడం ద్వారా ప్రైజ్ మనీలో కొంత రికవరీ అవుతుందని  బిగ్ బాస్ చెప్పడంతో.. హౌస్ మెంట్స్ చేయక తప్పడం లేదు. ఫస్ట్ రౌండ్ లో ఆదిరెడ్డి వెళ్లగా.. ఆతరువాత అతనికి తోడుగా శ్రీహాన్ ను కూడా పిలిచాడు.  కన్ఫెషన్ రూమ్ ని హారర్ సెట్ లాగా మార్చి వారిని ఏడపించడం స్టార్ చేశాడు బిగ్ బాస్. దీంతో చీకటి గదిలో ఆదిరెడ్డి హడలిపోయాడు. ఆ తర్వాత తోడుగా తెచ్చుకున్న శ్రీహాన్ కూడా భయపడ్డాడు. వీళ్లిద్దరూ ఫైనల్ గా బిగ్ బాస్ కనిపెట్టమన్న క్యాండిల్, గన్ ను కనిపెట్టి..  ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేశారు. 

ఇక ఈసారి ఆ చీకటిగదిలోకి శ్రీసత్యని పిలిచాడు బిగ్ బాస్. దాంతో ఈ ఎపిసోడ్ కే మజా వచ్చింది. శ్రీసత్య భయంతో వణికిపోతూ నేను వెళ్లనంటే వెళ్లనని మారాం చేసింది. అంతకుముందు లోపల ఎవరైనా పట్టుకుంటే ఇలా చేయాలి.. అలా వదిలేయాలి  అంటూ రకరకాలుగా ప్రగల్భాలు పలికిన శ్రీసత్య.. కన్ఫెషన్ రూమ్ దగ్గర చాలాసేపు వెళ్లనంటూ గోల చేసింది. హౌస్ మేట్స్ అందరూ బలవంతంగా తోస్తున్నా కూడా బయట డోర్ దగ్గరే నిలుచుండి పోయింది.  దాంతో బిగ్ బాస్ సత్య లోపలకు వెళ్లనందకు లక్ష రూపాయలు హౌస్ మెంట్స్ కోల్పోయినట్టు ప్రకటించాడు. దాంతో అంతా షాక్ అయ్యారు. రేవంత్ బాగా డిస్సపాయింట్ అయ్యాడు. 

భయపడినా కూడా శ్రీహాన్- ఆదిరెడ్డి టాస్క్ ను ఫినిష్ చేశారు. కాని శ్రీసత్య వల్ల లక్షరూపాయలు కోల్పోవడంతో.. అంతా డిస్సాయింట్ అయ్యారు. ముఖ్యంగా రేవంత్ ఈ విషయంలో బాగా అప్సెట్ అయ్యాడు. ఇక ఈసారి టాస్క్ లోకి రేవంత్, ఇనయా శ్రీసత్య రెడీ అయ్యారు. బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబ్ టాస్క్ లో రేవంత్, ఇనయా,శ్రీసత్య రెడీ అయ్యారు. అయితే హౌస్ లో ఉన్నవారు ఈ టాస్క్ లో ఇనయా గెలుస్తుంది అని ముందుగా తమ అభిప్రాయాని తెలియజేశారు. ఇందలో భాగంగా.. బిగ్ బాంబ్ ను తెలివితో డిస్ కనెక్ట్ చయాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో శ్రీసత్య విన్నర్ గా నిలిచింది. దాంతో.. ఇంటి సభ్యులు ఇనయాను సెలక్ట్ చేసుకోవడం.. శ్రీసత్య గెలవడంతో.. హౌస్ మెట్స్ 64 వేల పాయింట్స్ మిస్అయ్యారు. 

ఇక ఆతరువాత డార్క్ రూమ్ లోకి ఇనయా వెళ్లింది. ధైర్యంగా.. లోపలికి వెళ్లిన ఇనయా.. గదిలో అరుపులు కేకలకు భయపడి వణికిపోయింది. అయితే అనుకున్నది మాత్రం సాధించింది ఇనయా. అంత భయంతో..గదిలో వణికిపోతూ కూడా.. తన టాస్క్ ను కంప్లీట్ చేసింది ఇనయా. ఇక ఆతరువాత రేవంత్ డార్క్ రూమ్ లోకి వెళ్లగా.. రేవంత ధైర్యాన్ని ముందే గ్రహించిన బిగ్ బాస్.. రెండు డెవిల్ క్యారెక్టర్స్ ను డార్క్ రూమ్ లో సెట్ చేశారు. ఈక్రమంలో అస్సలు బయపడకుండా రేవంత్ అనుకున్నది సాధించి.. గదిలోంచి ఓ కప్ ను పట్టుకుని వచ్చాడు. 

ఆతరువాత మనీ టవర్ టాస్క్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. దీని ద్వారా హౌస్ మెంట్స్ కోల్పోయిన డబ్బును పొంద వచ్చు అన ఆప్షన్ ఇచ్చాడు. టవర్ లో బ్రిక్స్ ను తీసి.. టవర చెడిపోకుండా.. దాని హైట్ ను పెంచాలి. అంతా బాగానే ఆడారు. టవర్ హైట్ పెంచడానికి చాలా ట్రై చేశారు.. కాని చివరకు ఎవరి ప్రమేయం లేకుండా టవర్ కూలిపోయింది. ఇక ఆతరువాత కూడా జంతూవుల టాస్క ఇచ్చాడు బిగ్ బాస్.. రోజు మొత్తం టాస్క్ లతో మోత మోగించాడు. ఇక బోమ్మల టాస్క్ విషయంలో శ్రీహాన్ - శ్రీసత్య మధ్య పోటీ జరగ్గా.. హౌస్ మెట్స్ మాత్రం శ్రీహాన్ గెలుస్తాడంటూ.. నమ్మకంగా చెప్పారు. చివరకు బిగ్ లైట్ టాస్క్ లో కరెక్ట్ గా లైట్స్ సెట్ చేసే క్రమంలో శ్రీసత్య.. రేవంత్ మంధ్య కాస్త మనస్పర్ధ కూడావచ్చింది. చివరకు ఈ టాస్క్ లో .. అందరూ అనుకున్నట్టే.. శ్రీహాన్ గెలిచి చూపించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios