Asianet News TeluguAsianet News Telugu

ట్రాక్టర్ ఎక్కి వ్యవసాయం చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో అభిజిత్.. బిగ్ బాస్ విన్నర్ వీడియో వైరల్..

యంగ్ హీరోలంతా ఒక దారిలో వెళ్తుంటే... తాను మాత్రం మరోదారిలో వెళ్తున్నాడు టాలీవుడ్ హీరో.. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్.. ఇంతకీ యంగ్ స్టార్ ఏమంటున్నాడంటే..? 

Bigg Boss Telugu season 4 winner and Tollywood Hero Abhijeet plowing the field on a tractor JMS
Author
First Published Sep 9, 2023, 3:02 PM IST

నలుగురికి నచ్చినది నాకసే నచ్చదురో అంటూ.. మహేష్ బాబు పాటకు తగ్గట్టే.. ఫాలో అవుతున్నాడు యంగ్ హీరో అభిజిత్. అందరు తారలు అవకాశాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే.. తాను మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నాడు. సినిమాలు పక్కన పెట్టి.. టూర్లు వెళ్తున్నాడు. రకరకాల ప్రదేశాలు తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాదు తాజాగా ఈ బిగ్ బాస్ విన్నర్.. ట్రాక్టర్ ఎక్కి వ్యవసాయం కూడా చేస్తానంటున్నాడు. 

 బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ లో .. టాలీవుడ్ యంగ్ హీరో అభిజిత్ కూడా ఒకరు. హీరోగా రెండు మూడు సినిమాలు మాత్రమే చేసిన అబిజిత్. బిగ్ బాస్ లోకి వచ్చి... తను ఎలా ఉంటాడో అలానేఉండి.. ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ  షో ద్వారా అభిజిత్ ఇమేజ్ తో పాటు.. పాపులారిటీ కూడా బాగా పెరిగింది. అయితే రు. అభిజిత్ ఈ షో ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు. కాని  బిగ్ బాస్ షో తర్వాత అభిజిత్ కెరీర్ లో బాగా బిజీ అవుతారు అనుకుంటే అందుకు డిఫరెంట్ గా ఆయన ఆలోచిస్తున్నాడు. 

బిగ్ బాస్ తరువాత అభిజిత్ కు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కాని వాటిని పెద్దగా పట్టించుకోలేదు అభిజిత్. ఈ షో తరువాత ఒక వెబ్ సిరీస్ లో  మాత్రమే నటించారు.. ఆరువాత ట్రెవెలర్ అవతారం ఎత్తి.. వరుసగా టూర్లు ప్లాన్ చేశాడు. దేశ విదేశాలు తిరుగుతూ.. తన కోరికను నెరవేర్చుకుంటున్నాడు. అంతే కాదు మరో వాదన ఏంటంటేు.. అభిజిత్ ఆరోగయం బాగా ఉండటంలేదని.. అందుకే ఆయన సినిమాలు చేయకుండా.. లైఫ్ లో తనకు ఎంతో ఇష్టమైన ట్రావెలింగ్ ను తీసుకుని.. తాను అనుకున్న ప్రాంతాలు తిరుగుతున్నాడని తెలుస్తోంది. అంతే కాదు.. దానికి కావల్సిన టీమ్ తో పాటు.. ఎక్యూమ్మెంట్.. అన్నీ సెట్ చేసుకున్నాడు అభిజిత్. తన వీడియోలు అన్నీ.. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేస్తున్నాడు అభిజిత్. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abijeet (@abijeet11)

 అభిజిత్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటో హాట్ టాపిక్ అవుతోంది. ట్రాక్టర్ ఎక్కి బిగ్ బాస్ అభిజిత్ వ్యవసాయం చేస్తుండగా ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అభిజిత్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది. భారత్ మాతాకీ జై అంటూ ట్యాగ్ తో ఈ వీడియోను అభిజిత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఈ వీడియో నెటిజన్లకు ఎంతగానో నచ్చింది.

సినిమాల్లోకి అభిజిత్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిజిత్ డిమాండ్ చేస్తే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా అభిజిత్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిజిత్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. మరి ఈ విషయంలో అతను ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios