Bigg Boss Telugu 7: రతిక మావాడ్ని వాడుకుంది... రైతుబిడ్డ ప్రశాంత్ పేరెంట్స్ కీలక ఆరోపణలు!
బిగ్ బాస్ హౌస్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సంచలనంగా మారాడు. అతనికి భారీగా ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటి సభ్యులు అతన్ని టార్గెట్ చేసిన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7)సెన్సేషన్ పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారు కొందరు కంటెస్టెంట్స్ పై కీలక ఆరోపణలు చేశారు. పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ మాట్లాడుతూ... ''మా అబ్బాయి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లినందుకు చాలా అనందంగా ఉంది. అయితే అమర్ దీప్ చౌదరి ఏందిరా? అనడం నచ్చలేదు. రైతు బిడ్డ అని తక్కువగా చూస్తున్నారు. ఎవరికి ఉండేది వాళ్లకు ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానమే.
పల్లవి ప్రశాంత్ లవ్ సాంగ్ చేస్తే రూ. 7 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులు ఫ్రెండ్స్ మోసం చేసి కాజేశారు. దాంతో చచ్చిపోతానని అన్నాడు. నీకు ఏం కావాలన్నా నేను ఉన్నా అని చెప్పి అండగా నిలిచాను. ఫోన్ కావాలి రీల్స్ చేస్తాను అన్నాడు. ఫోన్ కొనిచ్చాను. రీల్స్ తో ఫేమస్ అయ్యాడు. ఏదో ఒకటి చేయాలని తిండి తిప్పలు లేకుండా తిరిగాడు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. నాగార్జునను కలిశాడు. మాకు ఎంతో సంతోషం అనిపించింది. రతికా రోజ్ మా వాడిని వాడుకుంది. అతనితో ఉంటే తనకు ఓట్లు పడతాయని భావించింది. పల్లవి ప్రశాంత్ అందరినీ అక్కా,చెల్లి అంటున్నాడు. అతనికి దురాలోచనలు లేవు.
బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక పల్లవి ప్రశాంత్ కి పెళ్లి చేస్తాం. ఇదివరకే పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఏదో ఒకటి సాధించే వరకు పెళ్లి వద్దు అన్నాడు. ఆ మాటెత్తితే ఇంటికి కూడా రాను అన్నాడు'' అని పేరెంట్స్ చెప్పుకొచ్చారు. రెండో వారం నామినేషన్స్ లో అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్ తో పాటు మెజారిటీ కంటెస్టెంట్స్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశారు. అయితే ఓటింగ్ లో అతడు దూసుకుపోతున్నట్లు సమాచారం...