Bigg Boss Telugu 7: సీరియల్స్ బ్యాచ్ కి అనుకూలంగా బిగ్ బాస్ డెసిషన్స్... ప్రిన్స్ యావర్ కి అన్యాయం!
బిగ్ బాస్ షోపై జనాలలో నమ్మకం పోవడానికి కొన్ని టాస్క్స్, నిర్ణయాలు, ఎలిమినేషన్స్ కారణం అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ ప్రిన్స్ యావర్ కి అన్యాయం చేశాడనిపిస్తుంది...

నిన్న శోభా శెట్టికి కంటెండర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. స్పైసీ చికెన్ తినాలని. ఎంత ఎక్కువ తింటే నీ ప్రత్యర్థులకు అంత పెద్ద పోటీ ఇస్తావ్ అన్నాడు. దాదాపు గంట వ్యవధిలో శోభా శెట్టి 27 చికెన్ పీసులు తిన్నది. శోభా స్థానం కోసం గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ పోటీపడ్డారు. వీరిని కూడా చికెన్ తినాలని ఆదేశించాడు. అయితే వీరికి టైం లిమిట్ పెట్టాడు. నిమిషాల వ్యవధిలో గౌతమ్ కృష్ణ 28 పీసులు తిన్నాడు. సంచాలక్ గా ఉన్న సందీప్ పూర్తిగా తినలేదని ఒక పీస్ కౌంట్ చేయలేదు. అయితే విన్నర్ గౌతమ్ అన్నాడు.
బిగ్ బాస్ మాత్రం శోభా శెట్టిని విన్నర్ గా ప్రకటించాడు. శోభా శెట్టి కూడా 27 పీసులు తిన్నది. ఆమెను గౌతమ్ అధిగమించలేదు కాబట్టి శోభా శెట్టి కంటెండర్ రేసులో ఉంటుందని చెప్పాడు. ఇక్కడ గౌతమ్ కృష్ణకు అన్యాయం జరిగింది. ఆమెకు గంట సమయం ఇచ్చి వీరికి నిమిషాల సమయం ఇచ్చారు. ఇద్దరూ సమానంగా తిన్నప్పుడు శోభాను విన్నర్ గా ఎలా ప్రకటిస్తారు అనే సందేహం కలుగుతుంది.
ఇక అమర్ దీప్ జుట్టు తీయనని చెప్పడంతో తనతో పోటీ పడ్డ ప్రియాంక జుట్టు తీసేసింది. దాంతో ప్రియాంక గెలిచి కంటెండర్ రేసులో నిలిచింది. ప్రిన్స్ యావర్, ప్రియాంక, శోభా శెట్టి కంటెండర్ స్థానం కోసం పోటీపడుతున్నారు. కాగా ఇక్కడ కూడా సీరియల్స్ బ్యాచ్ ప్రియాంక, శోభా శెట్టికి బిగ్ బాస్ ఫేవర్ చేశాడు. రేసులో ఉన్న ముగ్గురిలో మెజారిటీ సభ్యులు ఒకరిని వీక్ కంటెస్టెంట్ గా ప్రకటించి తప్పించాలని అన్నారు.
ప్రియాంక-శోభా కలిసి నిర్ణయం తీసుకుని వీక్ కంటెస్టెంట్ అంటూ ప్రిన్స్ యావర్ పేరు చెప్పారు. దానికి వారు చెప్పిన రీజన్ మేము లేడీస్. మేము పోటీపడితే బాగుంటుందని. అబ్బాయితో పోటీ పడలేనప్పుడు మీరు స్ట్రాంగ్ ఎలా అవుతారని ప్రిన్స్ యావర్ ఇద్దరితో ఆర్గ్యూ చేశాడు. అసలు బిగ్ బాస్ ముగ్గురిలో మెజారిటీ నిర్ణయం అని చెప్పడం చాలా రాంగ్. ప్రిన్స్ యావర్ ఫిజికల్ గా స్ట్రాంగ్ అనుకుంటే ఏదైనా మైండ్ గేమ్ పెడితే బాగుండేది. లేదా ఇంటి సభ్యులకు నిర్ణయం వదిలేయాల్సింది.
చూస్తుంటే బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్ ని వెనకేసుకు వస్తున్నాడనిపిస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఈ వారం అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, దామిని ఉన్నారు. ఈ ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది.