Asianet News TeluguAsianet News Telugu

రైతు బిడ్డ అంటివి ఇవేం పనులు, అందర్ని ఎర్రి పుష్పాలను చేశావ్‌, పల్లవి ప్రశాంత్‌ అడ్డంగా బుక్కయ్యాడుగా!

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కోట్‌ వేసుకుని కెమెరా ముందు పోజులుకొడుతున్నాడు. దీంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. 
 

bigg boss telugu 7 winner Pallavi Prashanth shocking look he gave feed to trollers arj
Author
First Published Oct 1, 2024, 11:35 PM IST | Last Updated Oct 1, 2024, 11:35 PM IST

`రైతు బిడ్డ` ట్యాగ్‌తో గత సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు పల్లవి ప్రశాంత్‌. `బిగ్ బాస్‌ తెలుగు 7`లోకి ఆయన రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగార్జున వద్దకు వస్తూ పంచెకట్టుతో అదరగొట్టాడు. అంతేకాదు నాగ్‌ కోసం వడ్ల బస్తా తీసుకొని వచ్చాడు. దీంతో ఒక్కసారిగా హైలైట్‌ అయ్యాడు పల్లవి ప్రశాంత్‌. ప్రారంభంలో అమాయకంగా ఉన్న ప్రశాంత్‌ నెమ్మదిగా పుంజుకున్నాడు. పులిలా విరుచుకుపడ్డాడు. రైతు బిడ్డ పేరుతో రెచ్చిపోయాడు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

నామినేషన్ల ప్రక్రియలో మాత్రం పుష్పరాజ్‌ మాదిరిగా తగ్గేదెలే అంటూ విజృంభించాడు. ఇలా తాను హౌజ్‌లోనే ప్రత్యేకంగా నిలిచాడు. అయితే ఒక దశలో రైతు బిడ్డ అనే ట్యాగ్‌ సింపతిగా మారింది. సింపతి గేమ్‌ కూడా ఆడాడు ప్రశాంత్‌. దీంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అ తర్వాత దాన్ని తగ్గించుకుని ఆటపై దృష్టిపెట్టాడు. టాస్క్ ల్లో కూడా తన బెస్ట్ ఇచ్చి బెస్ట్ ఆటగాడిగా నిలిచాడు. రైతు బిడ్డకి తగ్గట్టుగా తన ఆట తీరు అతన్ని స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మార్చింది. 

bigg boss telugu 7 winner Pallavi Prashanth shocking look he gave feed to trollers arj

రైతు బిడ్డగా వచ్చి టాప్‌ కంటెస్టెంట్‌గా పల్లవి ప్రశాంత్ విశ్వరూపం..

దీనికితోడు హౌజ్‌లో ఆయన శివాజీ గ్యాంగ్‌లో చేరారు. శివాజీ చాలా సపోర్ట్ చేశాడు. ఆయన సపోర్ట్ తో మరింత బలంగా మారాడు పల్లవి ప్రశాంత్‌. కొన్ని సార్లు శివాజీని డామినేట్‌ చేశాడు. దీనికితోడు శివాజీ చేయి నొప్పితో బాధపడుతుండగా, ఆ ఛాన్స్ ప్రశాంత్‌ తీసుకున్నాడు. ఇది అతనికి మరింత ప్లస్‌ అయ్యింది. మరోవైపు రైతు బిడ్డని సరైన సమయంలో సరైన విధంగా వాడుకుంటూ రెచ్చిపోతూ వచ్చాడు. అలాగే రతిక కూడా పల్లవి ప్రశాంత్‌ని బలంగా మార్చింది.

ఆమె మొదట్లో ప్రశాంత్‌తో పులిహోర కలిపింది. ఆ తర్వాత ఛీ పొమ్మన్నది. ఇది నీ అసలు నైజం అంటూ ప్రశాంత్‌పై బ్యాడ్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆమెలోని రెండు యాంగిల్స్ చూసిన ఆడియెన్స్ ప్రశాంత్‌కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో రతికనే ఎలిమినేట్‌ అయ్యింది. ఆ తర్వాత ఆమె రీఎంట్రీ ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. పల్లవి ప్రశాంత్ అప్పటికే నిజాలు తెలుసుకుని స్ట్రాంగ్‌గా వ్యవహించడం ప్రారంభించాడు. ఇవన్నీ అతనికి పాజిటివ్‌గా మారాయని చెప్పొచ్చు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌ విన్నర్‌గా సంచలనం..

ఇలా సైలెంట్‌గా హౌజ్‌లోనే స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ నుంచి టాప్‌ 5లో స్థానం సంపాదించాడు. అనూహ్యంగా చివరి వారాల్లో మరింత బలంగా దూసుకెళ్లాడు. అంతిమంగా విజేతగా నిలిచారు. బిగ్‌ బాస్‌ చరిత్రతో ఓ కామన్‌ మ్యాన్‌ విన్నర్‌గా నిలవడమనేది జరగలేదు. దీంతో పల్లవి ప్రశాంత్‌ గెలుపు సంచలనంగా మారింది. అంతా శివాజీ విన్నర్‌ అవుతారని అనుకున్నారు. కానీ ప్రశాంత్‌కి వచ్చిన క్రేజ్‌ ముందు శివన్న కూడా తగ్గిపోయాడు. మొత్తంగా ఆయన విన్నర్‌ అయ్యారు. అయితే తనకు వచ్చిన ప్రైజ్‌మనీని పేద రైతులకు ఆర్థిక సాయం చేస్తానని ముందే ప్రకటించాడు పల్లవి ప్రశాంత్‌.

గెలిచిన సమయంలోనూ దాన్ని గుర్తు చేస్తూ ప్రకటించారు. ఆ తర్వాత తను కేసుల్లో ఇరుక్కున్నాడు. ఫైనల్‌ రోజు చేసిన అల్లర్ల కారణంగా ప్రశాంత్‌ని జైల్లో పెట్టాల్సి వచ్చింది. దీంతో బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచాడనే ఆనందం కూడా లేకుండా పోయింది. జైలు నుంచి బెయిల్‌ పై వచ్చినా కొన్ని రోజులు పోలీస్‌ రూల్స్ ఫాలో కావాల్సి వచ్చింది.

bigg boss telugu 7 winner Pallavi Prashanth shocking look he gave feed to trollers arj

రైతులకు సాయం ఏదంటూ ప్రశాంత్‌పై ట్రోల్స్..

ఆ తర్వాత కొన్నాళ్లకి బిగ్‌ బాస్‌ విన్నింగ్‌ ప్రైజ్‌మనీ వచ్చింది. వచ్చిన వెంటనే కొంత మంది రైతులకు ఆర్థిక సాయం చేశాడు పల్లవి ప్రశాంత్‌. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. కానీ వచ్చిన అమౌంట్‌ని మొత్తం ఆయన సాయం చేయలేదని, కొందరికే చేసి చేతులు దులుపుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తరచూ పల్లవి ప్రశాంత్‌ని సోషల్‌ మీడియాలో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఆ తర్వాత తన నిబంధనలు సడలిపోవడంతో నెమ్మదిగా బయటకు కనిపించడం ప్రారంభించాడు.

పలు ఈవెంట్లలోనూ మెరిశాడు ప్రశాంత్‌. ఇక ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా కోట్‌ వేసుకుని, మీసాలు మెలేసి టిక్‌ టాక్‌లో రెడీ అయ్యి కెమెరా ముందు ఫోజులు కొడుతూ వీడియో దిగాడు. సెలూన్‌లో ఇలా సరికొత్తగా, స్టయిలీష్‌గా తయారై పోజులు కొడుతున్నాడు పల్లవి ప్రశాంత్. ఈ వీడియోని  సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. అది వైరల్ అవుతుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. అయితే ఇందులో చివర్లో బిగ్‌ బాస్‌ ఆరో సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ కూడా ఉండటం విశేషం. ఈ ఇద్దరు కలుసుకున్నారు. మరి ఏం చేశారనేది తెలియాల్సి ఉంది. 

 లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న పల్లవి ప్రశాంత్‌.. మళ్లీ ట్రోల్స్ 

ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ ఆడుకుంటున్నారు. రైతు బిడ్డ పేరుతో అందరిని ఎర్రి పుష్పాలు చేసి ఇలా జల్సాలు చేస్తున్నావా? అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఆయన గురించి పాజిటివ్‌గా మాట్లాడిన అందరిని ఎర్రి పుష్పాలను చేశాడని అంటున్నారు. రైతు బిడ్డ అంటివి, రైతులకు సాయం చేస్తానంటివి ఎంత మందికి చేశావో చెప్పూ అంటూ నిలదీస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నా అంటూ వీడియోలు పెడుతున్నావ్‌, ఇవేం పనులురా అంటూ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. రైతు బిడ్డ అనే ట్యాగ్‌ తో మోసం చేశావని కామెంట్లు చేస్తున్నారు.

అయితే కొందరు ఆయన్ని సమర్థించే వాళ్లు కూడా ఉన్నారు. రైతు బిడ్డ అయితే కోట్‌ వేసుకోకూడదా? పాష్‌గా రెడీ కాకూడదా? లగ్జరీ లైఫ్‌ అనుభవించ కూడదా అంటూ సపోర్టివ్ గా నిలుస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు మరోసారి బిగ్ బాస్‌ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతంగా బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీన్‌ రన్‌ అవుతుంది. నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. నలుగురు ఎలిమినేట్‌ కాగా, పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రి ఉండబోతుందని తెలుస్తుంది. అదే సమయంలో మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ కూడా ఉంటుందని టాక్‌. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios