Bigg Boss Telugu 7: ఆ ముగ్గురే నాకు పోటీ... వస్తూనే ఆరోపణలు మొదలుపెట్టిన అంబటి అర్జున్!
ఈ వారం సెకండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దానిలో భాగంగా నటుడు అంబటి అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. ఇక వస్తూనే అంబటి అర్జున్ ని నాగార్జున ఇరకాటంలో పెట్టాడు.

బిగ్ బాస్ సీజన్ 7 ఊహించని మలుపులతో సాగుతుంది. 14 మందితో మొదలైన షోలో 9 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. శుభశ్రీ ఎలిమినేట్ కాగా, గౌతమ్ సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు. ఈ వారం సెకండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దానిలో భాగంగా నటుడు అంబటి అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. ఇక వస్తూనే అంబటి అర్జున్ ని నాగార్జున ఇరకాటంలో పెట్టాడు. ఐదు వారాల గేమ్ చూసి వచ్చావు. ఇది నీకు ప్లస్ కదా అన్నాడు. ప్లస్ ఉంది మైనస్ ఉందని అంబటి అర్జున్ అన్నాడు.
ప్లస్ ఏంటంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పై ఒక అవగాహన వచ్చింది. ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. మైనస్ ఏంటంటే... ఆల్రెడీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు మధ్యలో వచ్చి వీళ్ళ గొడవ ఏంటి అన్నట్లు ఉంటుంది. కంటెస్టెంట్స్ కూడా అన్నీ చూసేవి వచ్చావ్ అంటారని అంబటి అర్జున్ అన్నాడు. ఇక అంబటి అర్జున్ కి నాగార్జున ఓ టాస్క్ పెట్టాడు.
దమ్ముగా ఆడుతున్న, దుమ్ముగా ఆడుతున్న ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు చెప్పాలని అన్నాడు. దమ్ముగా ఆడుతున్నగా కంటెస్టెంట్స్ గా యావర్, పల్లవి ప్రశాంత్ పేర్లు చెప్పాడు. ఇక దుమ్ముగా ఆడుతుంది సందీప్, అమర్ అన్నాడు. అమర్ నుండి ఇలాంటి గేమ్ ఊహించలేదు. అతడు పాయింట్ మాట్లాడలేకపోతున్నాడు. ఆ పాయింట్ ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు, అన్నాడు. ఇక సందీప్ టాస్క్స్ లో రూల్స్ ఫాలో కావడం లేదు. కోప్పడుతున్నాడని ఆరోపణలు చేశాడు.
యావర్, పల్లవి ప్రశాంత్ తమని తాము మార్చుకొని ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యారు. అవమానాలు, ఆరోపణల ఎదిరించి ఎదిగారని చెప్పాడు. మరి నీకు పోటీ ఎవరనుకుంటున్నావ్ అంటే. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ నాకు పోటీ అనుకోవడం లేదు, కానీ వాళ్లతో పోటీ పడాలి అనుకుంటున్నాను, అన్నాడు. అనంతరం అంబటి అర్జున్ ఇంట్లోకి వెళ్ళాడు. అతడికి సీరియల్ బ్యాచ్ నుండి గ్రాండ్ వెల్కమ్ దక్కింది.