Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: ఆరవ వారం షాకింగ్ ఓటింగ్... డేంజర్ లో ఆ టాప్ సెలబ్రిటీ!

మరో ఎలిమినేషన్ కి సమయం ఆసన్నం అవుతుంది. నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా ఓటింగ్ లో టాప్ సెలెబ్ వెనుకబడినట్లు సమాచారం. 
 

bigg boss telugu 7 this top celeb falls behind in voting ksr
Author
First Published Oct 12, 2023, 2:52 PM IST | Last Updated Oct 12, 2023, 2:52 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 ఆరవ వారానికి అమర్ దీప్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, నయని పావని, శోభా శెట్టి, పూజా మూర్తి, అశ్విని శ్రీ నామినేట్ అయ్యారు. సందీప్ కూడా నామినేషన్స్ లో ఉన్నప్పటికీ గౌతమ్ సేవ్ చేశాడు. సీక్రెట్ రూమ్ లో గౌతమ్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. తనకున్న ఈ పవర్ తో ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చు లేదా నామినేషన్స్ లో ఉన్న ఒకరిని సేవ్ చేయవచ్చు అన్నాడు. గౌతమ్ తాను ఎలిమినేట్ కాకూడదని ఓటేసిన సందీప్ ని సేవ్ చేశాడు. 

మంగళవారం నుండే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ఓటింగ్ లో ఎవరు ముందున్నారు ఎవరు వెనకున్నారో... విశ్వసనీయ సమాచారం అందుతుంది. అందరికంటే టాప్ లో యావర్ దూసుకుపోతున్నాడట. అతడికి ముప్పై శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. ప్రిన్స్ తర్వాత రెండో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. అతడికి ఇరవై శాతం ఓట్ల వరకు వచ్చాయి. మూడో స్థానంలో టేస్టీ తేజా, నాలుగో స్థానంలో అశ్విని శ్రీ, ఐదో స్థానంలో నయని పావని ఉన్నారట. 

చివరి రెండు స్థానాల్లో పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నట్లు సమాచారం. వైల్డ్ కార్డు ఎంట్రీల కంటే కూడా తక్కువ ఓట్లు తెచ్చుకున్న శోభా శెట్టి లీస్ట్ లో ఉన్నారట. పూజా-శోభా మధ్య ఒక శాతం ఓటింగ్ తేడా ఉందట. మరి ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే శోభా శెట్టి ఇంటికి పోవడం ఖాయం అంటున్నారు. కార్తీక దీపం సీరియల్ తో పాపులర్ అయిన శోభాకు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక గత ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios