Bigg Boss Telugu 7: ఎలిమినేషన్ తో ఎపిసోడ్ మొదలు... ఆ కంటెస్టెంట్ నేరుగా ఇంటికి!
బిగ్ బాస్ తెలుగు 7 ఊహించని పరిణామాలతో సాగుతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే సందిగ్ధత కొనసాగుతుండగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఎన్నడూ లేని విధంగా రెండు లాంచింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎపిసోడ్లో కొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారు. గతంలో ఒకరిద్దరు మినహాయిస్తే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండేవి కాదు. ఈసారి మాత్రం 5-7 వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళుతున్నట్లు సమాచారం అందుతుంది. సెకండ్ లాంచింగ్ ఈవెంట్ కి గెస్ట్స్ గా సిద్దార్థ్, రవితేజ వస్తున్నారు. తమ లేటెస్ట్ చిత్రాలు చిన్నా, టైగర్ నాగేశ్వరరావులను ప్రమోట్ చేయనున్నారు.
ఇక ఎలిమినేషన్స్ లో కూడా సరికొత్త పంథా చూపించనున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వస్తారు. ఈసారి మాత్రం ఫస్ట్ ఎలిమినేషన్ తో మొదలవుతుందని చెప్పాడు. అందుకే నామినేషన్స్ లో ఉన్న అమర్ దీప్, ప్రియాంక, శివాజీ, ప్రిన్స్ యావర్, తేజా, గౌతమ్, శుభశ్రీలకు గుడ్ బై చెప్పేయండి. వీరిలో ఎలిమినేట్ అయినవాళ్లు మరలా కనిపించరని నాగార్జున శోభా, పల్లవి ప్రశాంత్, సందీప్ కి చెప్పాడు.
లేటెస్ట్ ప్రోమోలో కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ, సిద్ధార్థ్, రవితేజలు రావడంతో పాటు ఎలిమినేషన్ ప్రాసెస్ చూపించారు. అయితే నిన్నటి వరకు ప్రియాంక ఎలిమినేటెడ్ అని ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక లేదా గౌతమ్ సీక్రెట్ రూమ్ కి వెళతారట. లేదా శుభశ్రీ లేదా ప్రియాంక ఎలిమినేట్ అవుతారంటూ సోషల్ మీడియా టాక్. మరికొన్ని గంటల్లో ప్రసారం కానున్న వీడియోతో మొత్తం క్లారిటీ రానుంది.
ఇక హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, పూజా మూర్తితో పాటు మరో నలుగురు రానున్నారని అంటున్నారు. అలాగే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన దామని, రతికా రోజ్ లలో ఒకరు లేదా ఇద్దరు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.