Bigg Boss Telugu 7: వీకెండ్ హీట్... ఈ వారం ఆ కంటెస్టెంట్ అవుట్?
బిగ్ బాస్ షో వీకెండ్ కి చేరువైంది. ఈ ఆదివారం మరొక కంటెస్టెంట్ హౌస్ వీడనున్నారు. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆమెనే అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ గా లాంచ్ చేశారు. అనూహ్యంగా 14 మంది కంటెస్టెంట్ తో షో ప్రారంభమైంది. గతంలో 19 నుండి 21 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలైంది. చివరి నిమిషంలో కొందరు సెలెబ్స్ తప్పుకోవడంతో తక్కువ మంది హౌస్లోకి ప్రవేశించారు అంటున్నారు. ఇక మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా ఇంటిని వీడారు. మూడవ వారానికి అమర్ దీప్, ప్రియాంక, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, దామిని, రతికా రోజ్, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో ఉన్నారు.
ఓటింగ్ లెక్కలు బయటకు పొక్కిన నేపథ్యంలో ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుందని అంటున్నారు. ఓటింగ్ లో అమర్ దీప్ చౌదరి టాప్ లో ఉన్నాడట. చివరి రెండు స్థానాల్లో దామిని, ప్రియాంక ఉన్నారట. దామిని-ప్రియాంక మధ్య దాదాపు 5% ఓట్ల వ్యత్యాసం ఉందట. ఇక సమీకరణాలు మారే అవకాశం కూడా లేదు. కాబట్టి సింగర్ దామిని ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. మరి అదే జరిగితే వరుసగా మూడో లేడీ కంటెస్టెంట్ ఇంటిని వీడినట్లు అవుతుంది.
కాగా ఆట సందీప్, శివాజీ పవర్ అస్త్ర సొంతం చేసుకున్నారు. కొన్ని వారాల వరకు వాళ్ళకు ఎలిమినేషన్ ఉండదు. మూడో పవర్ అస్త్ర రేసులో ప్రియాంక, దామిని ఉన్నారు. వీరిలో ఎవరు గెలిస్తే వారికి మూడు వారాల ఇమ్యూనిటీ లభిస్తుంది. సీరియల్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్న అమర్ దీప్, ప్రియాంక, శోభ శెట్టికి బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.