Bigg Boss Telugu 7: నాలుగో వికెట్ డౌన్... ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు 7 మరో వీకెండ్ కి చేరువైంది. అంటే మరొక ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. నామినేషన్స్ లో ఆరుగురు ఉండగా ఆ కంటెస్టెంట్ అవుట్ అనే వాదన వినిపిస్తోంది.

వీకెండ్ వచ్చిందంటే బిగ్ బాస్ ఆడియన్స్ కి పండగ వాతావరణం నెలకొంటుంది. హోస్ట్ నాగార్జున రివ్యూలు ఆసక్తి రేపుతాయి. ఆదివారం మాత్రం ఫుల్ ఫన్ గా ఎపిసోడ్ సాగుతుంది. అదే సమయంలో ఎలిమినేషన్ టెన్షన్ కూడా వెంటాడుతుంది. ఇక ఇప్పటి వరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటిని వీడారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడోవారం దామిని ఎలిమినేటై వెళ్లిపోయారు.
వరుసగా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ హౌస్ ని వీడిన నేపథ్యంలో ఈసారి అబ్బాయిల వంతు అంటున్నారు. మేల్ కంటెస్టెంట్ ఇంటిని వీడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సరికొత్తగా నిర్వహించాడు బిగ్ బాస్. శివాజీ, సందీప్, శోభా శెట్టిలను జ్యూరీ సభ్యులుగా నియమించాడు. నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ చెప్పే కారణాలను వారు ఏకీభవించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో రతికా రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక నామినేట్ అయ్యారు.
అయితే జ్యూరీ సభ్యులు ఏకాభిప్రాయంతో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని చెప్పాడు. అప్పుడు టేస్టీ తేజాను నామినేట్ చేశారు. అది అతనికి భారీ నష్టం చేయనుందని సమాచారం. ఈ వారం టేస్టీ తేజా హౌస్ వీడనున్నాడని అంటున్నారు. ఓటింగ్ లో ప్రిన్స్ యావర్ టాప్ లో ఉన్నాడట. తర్వాత స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడట. ప్రియాంక, శుభశ్రీ మధ్య గట్టి పోటీ నడిచిందట.
అనూహ్యంగా అందరికంటే రతికా రోజ్ కి తక్కువ ఓట్లు వచ్చాయట. టేస్టీ తేజా కూడా వెనుకపడ్డాడట. వీరిద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉందట. ఈ క్రమంలో టేస్టీ తేజా లేదా రతికా రోజ్ ఈ వారం హౌస్ ని వీడతారని సమాచారం. వరుసగా ముగ్గురు లేడీస్ హౌస్ వీడిన తరుణంలో ఈసారి అబ్బాయిని బయటకు పంపుతారని అంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది.