Asianet News TeluguAsianet News Telugu

ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్... అన్యాయం అంటున్న నెటిజెన్స్ 

బిగ్ బాస్ తెలుగు 7లో ఐదో వారం ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. ఎగురుగు నామినేషన్స్ లో ఉండగా ఆ కంటెస్టెంట్ అవుట్ అంటున్నారు. 
 

bigg boss telugu 7 this contestant eliminated fans not happy ksr
Author
First Published Oct 8, 2023, 7:06 PM IST


బిగ్ బాస్ హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర గెలిచిన నేపథ్యంలో నామినేషన్స్ నుండి మినహాయింపు పొందారు. శివాజీకి కూడా పవర్ అస్త్ర ఉంది. అయితే శోభా శెట్టి నిర్ణయంతో అతడు దాన్ని కోల్పోయాడు. కాగా ఈ వారానికి అమర్ దీప్, ప్రిన్స్ యావర్, తేజా, శుభశ్రీ, గౌతమ్, ప్రియాంక, శివాజీ నామినేషన్స్ లో ఉన్నారు. అనూహ్యంగా ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ వేరుగా ఉంటుందని నాగార్జున చెప్పాడు.
 
సాధారణంగా ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. ఈసారి ఎలిమినేషన్ తోనే ఎపిసోడ్ మొదలవుతుందని చెప్పాడు. ఎలిమినేటైన కంటెస్టెంట్ నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇకపై కనిపించరు అని చెప్పారు నాగార్జున. కాగా నిన్నటి వరకు ప్రియాంక లేదా తేజా ఎలిమినేట్ కానున్నారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా ప్రియాంక వెళ్ళిపోతుందని అన్నారు. 

అనూహ్యంగా శుభశ్రీ పేరు తెరపైకి వచ్చింది. శుభశ్రీ ఎలిమినేట్ కానుందట. అయితే శుభశ్రీ ఎలిమినేషన్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె స్ట్రాంగ్ ప్లేయర్. శుభశ్రీని ఎలిమినేషన్ నాట్ ఫెయిర్ అంటున్నారు.ఇక హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, పూజా మూర్తితో పాటు మరో నలుగురు రానున్నారని అంటున్నారు. అలాగే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన దామని, రతికా రోజ్ లలో ఒకరు లేదా ఇద్దరు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios