Bigg Boss Telugu 7: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆ ఇద్దరు కంటెస్టెంట్స్... ఎలిమినేట్ అయ్యేదెవరు?
ఫస్ట్ వీక్ కి గానూ నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వీరిలో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది.

సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. ప్రతి కంటెస్టెంట్ నామినేట్ చేసే ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు చెప్పి వాళ్ళ ఫోటోలు ధ్వంసం చేయాలని చెప్పాడు. అలాగే ఎలిమినేషన్ కి నామినేట్ చేయడానికి గల కారణాలు ఏమిటో వివరించాలని చెప్పారు. 14 మంది కంటెస్టెంట్స్ తగు కారణాలతో ఇద్దరిని నామినేట్ చేశారు. అత్యధికంగా ఓట్లు పొందిన పల్లవి ప్రశాంత్, దామిని, ప్రిన్స్ యావర్, షకీలా, శోభిత శెట్టి, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు.
మంగళవారం నుండి ఓటింగ్ మొదలైంది. ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా ఒకరు ఎలిమినేట్ అవుతారు. ప్రేక్షకుల ఓటింగ్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దూసుకుపోతున్నట్లు సమాచారం. అత్యధిక ఓట్లతో అతడు మొదటి స్థానంలో ఉన్నాడట. రెండో స్థానంలో కార్తీకదీపం ఫేమ్ శోభిత శెట్టి ఉన్నారట. రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, షకీలా, ప్రిన్స్ యావర్ వరుసగా వారి తర్వాత స్థానాల్లో ఉన్నారు.
యామిని, కిరణ్ రాథోడ్ రేసులో వెనుకబడ్డారట. కిరణ్ రాథోడ్ కి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. ఆమె అందరికంటే బాటమ్ లో ఉన్నారు. దామిని పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఆమె పొజీషన్ బాటమ్ నుండి సెకండ్ అంటున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం. అయితే బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. ఈ వారం రోజుల్లో పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు.