Bigg Boss Telugu 7: కదలకురా వదలకురా... పవర్ అస్త్ర దక్కేది ఎవరికీ?
శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఎవరికి పవర్ అస్త్ర దక్కిందో నేటి ఎపిసోడ్ తో తేలనుంది. ఇక ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పవర్ అస్త్ర గెలిచిన కంటెస్టెంట్స్. వీరు అధికారికంగా హౌస్ మేట్స్ అయ్యారు.
బిగ్ బాస్ షోలో నాలుగులో కంటెండర్ కోసం పోటీ జరుగుతుంది. వివిధ దశల్లో గెలిచిన ప్రిన్స్ యావర్, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ రేసులో నిలిచారు. ఈ ముగ్గురిలో ఒకరు నెక్స్ట్ కంటెండర్ అవ్వనున్నారు. వీరికి బిగ్ బాస్ ఒక పోటీ పెట్టారు. పవర్ అస్త్రను ముగ్గురు పట్టుకోవాలి. ఎవరు వదిలేస్తే వాళ్ళు రేసు నుండి తప్పుకున్నట్లు. ఈ గేమ్ లో ఒకరినొకరు కన్విన్స్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మిగతా ఇద్దరిని వదిలేయమని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎవరూ వదల్లేదు.
దీంతో బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టాడు. కదలకురా వదలరా అంటూ ఓ టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో గెలిచినవాళ్లకు పవర్ అస్త్ర దక్కుతుంది. శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఎవరికి పవర్ అస్త్ర దక్కిందో నేటి ఎపిసోడ్ తో తేలనుంది. ఇక ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పవర్ అస్త్ర గెలిచిన కంటెస్టెంట్స్. వీరు అధికారికంగా హౌస్ మేట్స్ అయ్యారు.
నాలుగో పవర్ అస్త్ర గెలిచిన కంటెస్టెంట్ కి రెండు వారాల ఇమ్యూనిటీ లభిస్తుంది. మరి ఆ అదృష్టం ఎవరికి. 14 మందితో షో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్లో 11 మంది ఉన్నారు. ఈ వారానికి తేజా, ప్రియాంక, గౌతమ్, శుభశ్రీ, ప్రిన్స్, రతికా రోజ్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
ఇక వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. అంబటి అర్జున్, పూజా మూర్తి, ఫర్జానాతో పాటు మరికొందరు హౌస్లోకి వెళ్లనున్నారట. ఇక చూడాలి కొత్త వాళ్ళు వచ్చాక హౌస్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో...