Asianet News TeluguAsianet News Telugu

Bigg boss Telugu 7: ఆల్మోస్ట్ ఓటింగ్ కంప్లీట్... సంచలన ఎలిమినేషన్ కి రంగం సిద్ధం!

మంగళవారం మొదలైన ఓటింగ్ శుక్రవారంతో ముగుస్తుంది. దాదాపు ఓటింగ్ క్లోజింగ్ అంటుండ ఆ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నదట.

Bigg boss telugu 7 these contestant in danger zone ksr
Author
First Published Oct 13, 2023, 8:16 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 ఆరవ వారానికి అమర్ దీప్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, నయని పావని, శోభా శెట్టి, పూజా మూర్తి, అశ్విని శ్రీ నామినేట్ అయ్యారు. సందీప్ కూడా నామినేషన్స్ లో ఉన్నప్పటికీ గౌతమ్ సేవ్ చేశాడు. సీక్రెట్ రూమ్ లో గౌతమ్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. తనకున్న ఈ పవర్ తో ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చు లేదా నామినేషన్స్ లో ఉన్న ఒకరిని సేవ్ చేయవచ్చు అన్నాడు. గౌతమ్ తాను ఎలిమినేట్ కాకూడదని ఓటేసిన సందీప్ ని సేవ్ చేశాడు. 

మంగళవారం నుండే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ఓటింగ్ లో ఎవరు ముందున్నారు ఎవరు వెనకున్నారో... విశ్వసనీయ సమాచారం అందుతుంది. అందరికంటే టాప్ లో యావర్ దూసుకుపోతున్నాడట. అతడికి ముప్పై శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. ప్రిన్స్ తర్వాత రెండో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. అతడికి ఇరవై శాతం ఓట్ల వరకు వచ్చాయి. మూడో స్థానంలో టేస్టీ తేజా, నాలుగో స్థానంలో అశ్విని శ్రీ, ఐదో స్థానంలో నయని పావని ఉన్నారట. 

చివరి రెండు స్థానాల్లో పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నట్లు సమాచారం. వైల్డ్ కార్డు ఎంట్రీల కంటే కూడా తక్కువ ఓట్లు తెచ్చుకున్న శోభా శెట్టి లీస్ట్ లో ఉన్నారట. పూజా-శోభా మధ్య ఒక శాతం ఓటింగ్ తేడా ఉందట. నేటితో ఓటింగ్ ముస్తుంది. ఫైనల్ రిజల్ట్ కూడా తేడా ఏం లేదంటున్నారు. శోభా శెట్టి ఇంటికి పోవడం ఖాయం అంటున్నారు. మరి ఇదే జరిగితే ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ అవుతుంది. ఆదివారం దీనిపై స్పష్టత రానుంది. ఇక ప్రతి నామినేషన్ ముందే తెలిసిపోతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios