Asianet News TeluguAsianet News Telugu

నామినేషన్స్ లిస్ట్ లీక్... ఆ కాన్సెప్ట్ తో మగాళ్లకు అన్యాయం! ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

ఆదివారం టేస్టీ తేజా ఎలిమినేట్ అయ్యాడు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది. అధికారిక ఎపిసోడ్ కి ముందే నామినేషన్స్ లిస్ట్ లీకైంది. మరి ఎవరెవరు నామినేట్  అయ్యారో చూద్దాం... 
 

Bigg boss telugu 7 tenth week nominations list leak who will be eliminated ksr
Author
First Published Nov 6, 2023, 12:39 PM IST

బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ గా 10వ వారంలో అడుగుపెట్టింది. ఆదివారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. రతిక-తేజ అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్లో నిలిచారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాను ఎలిమినేట్ కావడం ఖాయమని భావించిన రతిక హోస్ట్ నాగార్జునను వేడుకుంది. అయితే తేజ ఎలిమినేట్ అయినట్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. 

తేజ ఎలిమినేషన్ తో హౌస్లో 11 మంది మిగిలారు. అశ్విని, రతిక రోజ్, శోభ, ప్రియాంక లను ఈ వారం నామినేషన్స్ నుండి మినహాయించినట్లు తెలుస్తోంది. 'రాజమాత-ప్రజా' అనే కాన్సెప్ట్ తో ఈ వారం నామినేషన్స్ డిజైన్ చేశారు. నలుగురు లేడీ కంటెస్టెంట్స్ రాజమాతలుగా ఉంటారు. మేల్ కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. 

సదరు నామినేషన్స్ ని రాజమాతలుగా ఉన్న లేడీ కంటెస్టెంట్స్ ధృవీకరించాలి. దీంతో హౌస్లో ఉన్న మేల్ కంటెస్టెంట్స్ అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అర్జున్, గౌతమ్, భోలే, యావర్ నామినేట్ అయ్యారట. అంటే వచ్చే వారం కూడా వరుసగా మరో మేల్ కంటెస్టెంట్ ఇంటిని వీడనున్నాడు. గత రెండు వారాల్లో సందీప్, తేజ ఎలిమినేట్ అయ్యారు. అంతకు ముందు వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. 

హౌస్లో కేవలం నలుగురు అమ్మాయిలే ఉండగా వాళ్ళను ఎలిమినేట్ చేసే ఆలోచన లేదని తెలుస్తుంది. గత మూడు వారాలుగా ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్స్ ఉంటున్నాయని సమాచారం. నయని పావని, సందీప్, తేజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటున్నారు. ముఖ్యంగా శోభను కాపాడేందుకు ఇతరులను బలి చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ వారం లిస్ట్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కాబట్టి భోలే, యావర్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios