నువ్వు గెలికితే నేను గెలకనా...గెలుకు నాకు బాగా ఇష్టం... ఛీ ఛీ ఇలా తయారయ్యారేంటి!
నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగుతుంది. అశ్వినిని యావర్ నామినేట్ చేయగా తిరిగి ఆమె నామినేట్ చేసింది. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది.

బిగ్ బాస్ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టాడు. ప్రతి హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేయబడ్డ హౌస్ మేట్ ముఖాన డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది. పల్లవి ప్రశాంత్... అమర్ దీప్, తేజాలను నామినేట్ చేశాడు. అనంతరం వచ్చిన ప్రియాంక.. రతిక, భోలేలను చేసింది. ఇక అర్జున్... అమర్, శోభా శెట్టిలను చేశాడు. శివాజీ... అమర్ దీప్, తేజాలను చేశాడు. రతిక సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభాలను చేసింది. తేజ... అర్జున్, రతికలను నామినేట్ చేశారు. భోలే... ప్రియాంక, అమర్ లను నామినేట్ చేశాడు...
మంగళవారం కూడా నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. కాగా యావర్... రతిక, అశ్వినిలను నామినేట్ చేశాడు. అశ్విని-యావర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భోలే తనని నామినేట్ చేసిన క్రమంలో యావర్ తిరిగి భోలేను నామినేట్ చేశాడు. కాగా యావర్ అశ్వినిని నామినేట్ చేయగా ఆమె కూడా తిరిగి నామినేట్ చేసింది.
నీకు తెలుగు వచ్చా? అని అశ్విని యావర్ ని అడిగింది. రాదు అని తల ఊపాడు. మరి ఎందుకు వచ్చావ్ అని అశ్విని ప్రశ్నించింది. ఆ మాటకు యావర్ ఫైర్ అయ్యాడు. నువ్వు ఆడపిల్లను చేసి ఆడుకుంటున్నావ్ అని కూడా తెలుస్తుంది. నువ్వు నన్ను గెలికావు, అందుకే నిన్ను నేను గెలుకుతున్నా అని అశ్విని అనడంతో... యావర్ మరింత రెచ్చిపోయాడు. హా గెలుకు అది నాకు బాగా ఇష్టం అన్నాడు.
అశ్విని-యావర్ వాగ్వాదం ఇబ్బంది కలిగించేలా ఉంది. నేడు నామినేషన్స్ ముగియనున్నాయి. ఎవరు నామినేట్ అయ్యారో బిగ్ బాస్ తెలియజేస్తాడు. అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది నామినేట్ అయ్యారట. అమర్, ప్రియాంక, శోభా, తేజ, భోలే, యావర్, రతిక, అర్జున్ నామినేట్ అయినట్లు సమాచారం.