Bigg Boss Telugu 7: శివాజీకి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ అతడేనా?
బిగ్ బాస్ హౌస్లో శివాజీ దూసుకుపోతున్నాడు. అంచనాలకు మించి ఆడుతున్నాడు. అయితే అతడికి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ వచ్చాడనే మాట వినిపిస్తుంది.

ప్రస్తుతం హౌస్లో శివాజీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. టైటిల్ ఫేవరేట్ గా ఉన్నాడు. మొదట్లో తడబడ్డ శివాజీ మెల్లగా నిలదొక్కుకున్నాడు. స్ట్రాంగ్ ప్లేయర్ గా అవతరించాడు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూల్ గా గేమ్ ఆడుతున్నాడు. అలాగే తనకంటూ ఓ టీమ్ ని ఫార్మ్ చేసుకున్నాడు. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ అతనికి శిష్యులుగా తయారయ్యారు. తేజా కూడా అతని మాట వింటున్నాడు.
శివాజీ మైండ్ గేమ్ బాగుంది. అది వర్క్ అవుట్ అవుతుంది. పాయింట్స్ లేవనెత్తడం, ఎదుటి వాళ్ళ పాయింట్స్ కౌంటర్స్ కూడా గట్టిగా ఇస్తున్నాడు. అందుకే శివాజీకి ప్రేక్షకుల్లో ఆదరణ పెరిగింది. సానుభూతి సొంతం చేసుకున్న ప్రశాంత్, యావర్ లకు శివాజీ మద్దతుగా నిలవడం కూడా అతనికి ప్లస్ అని చెప్పాలి. శివాజీకి పోటీ ఇస్తారనుకున్న అమర్ దీప్, గౌతమ్ తేలిపోయారు. వాళ్ళు రేసులో లేరు. కొంతలో కొంత గౌతమ్ బెటర్.
అయితే శివాజీకి అంబటి అర్జున్ నుండి పోటీ ఎదురు కావచ్చని సోషల్ మీడియా టాక్. అతడు హౌస్లో ఎవరు ఎలాంటి వాళ్ళో అధ్యయనం చేసి వచ్చాడు. అదే సమయంలో పాయింట్స్ నీట్ గా మాట్లాడుతున్నాడు. అమర్ దీప్ ని నామినేట్ చేస్తూ అర్జున్ చెప్పిన ప్రతి మాట కరెక్ట్. కాబట్టి అతనికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మీద పూర్తి అవగాహన ఉంది. ఎవరిని ఎలా డీల్ చేయాలో ఒక ప్లాన్ వేసుకొని వచ్చి ఉంటాడు.
అంబటి అర్జున్ కూడా శివాజీకి ధీటుగా ఎదిగే అవకాశం లేకపోలేదు. ఇక చూడాలి కొత్త పాత వాళ్లతో మిళితమైన హౌస్ ఎలా ముందుకు వెళుతుందో... గత ఆదివారం నిర్వహించిన రీ లాంచ్ ఈవెంట్ ద్వారా అంబటి అర్జున్, అశ్విని, భోలే షావలి, పూజా మూర్తి, నయని పావని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. మరలా హౌస్లో 14 మంది కంటెస్టెంట్స్ అయ్యారు.