నయని పావని ఎలిమినేషన్ , ఓటింగ్ విషయంలో కేసు వేయాలంటూ మాజీ కంటెస్టెంట్ సంచలన ట్వీట్
బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ షోపై సంచలన ట్వీట్ చేశాడు. నయని పావని ఎలిమినేషన్ నేపథ్యంలో ఓటింగ్ పరిగణలోకి తీసుకోలేదని అన్నాడు.
బిగ్ బాస్ తెలుగు 7 రీ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన హోస్ట్ నాగార్జున ఐదుగురు కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి పంపాడు. అంబటి అర్జున్, నయని పావని, అశ్వినిశ్రీ, పూజా మూర్తి, భోలే షావలి హౌస్లో అడుగుపెట్టారు. అనూహ్యంగా వీరిలో ఒక వికెట్ డౌన్ అయ్యింది. నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. అమర్ దీప్, ప్రిన్స్ యావర్,తేజా, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, శోభా శెట్టి నామినేట్ అయ్యారు. వీరు ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు.
చివరికి అశ్వినీ శ్రీ, నయని పావని పిలిచాడు. సీక్రెట్ రూమ్ కి ఇద్దరినీ పిలిచిన నాగార్జున నయని పావని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో నయని పావని షాక్ అయ్యింది. ఆమె ఒక్కసారిగా కూలిపోయింది. బాగా ఏడ్చేసింది. వేదిక మీద కూడా నయని పావని ఏడుస్తూనే ఉంది. కేవం ఒక వారంలో ఎలిమినేట్ అవుతానని ఆమె ఊహించి ఉండదు. వైల్డ్ కార్డు ఎంట్రీ కావడంతో ఒకటి రెండు వారాలు ఆమెకు ఛాన్స్ ఉంటుందని భావించి ఉండవచ్చు.
ముఖ్యంగా శివాజీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. శివాజీ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మా నాన్న కూడా అంతే. ప్రతి రోజూ ఉదయం హగ్ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అని చెప్పింది. శివాజీ వీలైతే తనను ఎలిమినేట్ చేసి నయని పావనిని సేవ్ చేయాలని కోరాడు. ఎవరు హౌస్లో ఉండాలి, వారు వెళ్ళిపోవాలి అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారని నాగార్జున అన్నాడు.
అయితే నయని పావని ఎలిమినేషన్ పై మాజీ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ సంచలన ట్వీట్ వేశాడు. ఆమె ఎలిమినేషన్ వేదనకు గురి చేసిందని అన్నాడు. నయని పావని ఒక్కవారంలో ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ కాదు. ఆమె గేమ్ బాగా ఆడుతుంది. ఓటింగ్ కి ఎలిమినేషన్ కి సంబంధం లేదని ఇప్పుడు జనాలకు అర్థమైంది. ఓటింగ్ విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎవరైనా ఈ విషయమై కేసు వేస్తే బాగుండు, అంటూ ట్వీట్ చేశాడు.
అర్జున్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. నిజానికి చాలా కాలంగా బిగ్ బాస్ ఓటింగ్, ఎలిమినేషన్ మీద అనుమానాలు ఉన్నాయి. కొన్ని ఎలిమినేషన్స్ వివాదాస్పదం అయ్యాయి. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయం కచ్చితంగా తెలియదు. ఇక అర్జున్ కళ్యాణ్ గత సీజన్లో తక్కువ వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. శ్రీసత్య చుట్టూ తిరుగుతూ గేమ్ వదిలేశాడు...