Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: బర్త్ డే వేళ అమర్ దీప్ కి బిగ్ బాస్ భారీ షాక్... కన్ఫెషన్ రూమ్ కి పిలిచి బ్యాడ్ న్యూస్!

ఫ్యామిలీ వీక్ లో అమర్ దీప్ కి బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. తన కోసం ఏ ఫ్యామిలీ మెంబర్ రావడం లేదని చెప్పడంతో భార్య తేజు కోసం ఎదురుచూసిన అమర్ నిరాశ చెందాడు. 
 

bigg boss telugu 7 shock to amar deep on family week ksr
Author
First Published Nov 9, 2023, 1:56 PM IST

బిగ్ బాస్ సీజన్ 7లో పదో వారం కూడా చివరి దశకు చేరింది. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. హౌస్ మేట్స్ ని కలిసేందుకు కుటుంబ సభ్యులు వస్తున్నారు. శివాజీ కోసం కొడుకు కెన్నీ, అర్జున్ భార్య సురేఖ, అశ్విని తల్లి మంగళవారం వచ్చారు. ఇక బుధవారం గౌతమ్ తల్లి, భోలే భార్య, ప్రియాంక ప్రియుడు శివ కుమార్ వచ్చారు. గురువారం అమర్ దీప్ వంతు వచ్చింది. అయితే అమర్ దీప్ కి బిగ్ బాస్ స్వీట్ షాక్ ఇచ్చాడు. 

కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మీ భార్య తేజు రావడం లేదన్నాడు. తన కోసం తేజస్విని వస్తుందని ఎదురు చూసిన అమర్ దీప్ నిరాశకు గురయ్యాడు. కన్ఫెషన్ రూమ్ లో అమర్ దీప్ ముందు టేబుల్ పై క్లాత్ క్రింద ఒక వస్తువు ఉంచాడు. అదేమిటో ఊహించి చెప్పాలని బిగ్ బాస్ అమర్ దీప్ ని అడిగాడు. కేక్ అనుకుంటున్నా బిగ్ బాస్ అని అమర్ అన్నాడు. 

నువ్వు గెస్ చేసింది నిజమే. మీ భార్య తేజస్విని ఆ కేక్ పంపారు. ఆమె రావడం లేదు కనుక,  బదులుగా నీకు కేక్ పంపారని బిగ్ బాస్ చెప్పడంతో అమర్ దీప్ ఫీల్ అయ్యాడు. అందరినీ కలిసేందుకు కుటుంబ సభ్యులు వస్తుంటే, తేజస్విని వస్తుందని గుండెల్లో అనిపించిందని అమర్ అన్నాడు. కేక్ తీసుకొని బయటకు వెళుతుంటే, బిగ్ బాస్ అమర్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు. 

బయటకు వచ్చిన అమర్ హౌస్ మేట్స్ తో తేజస్విని రావడం లేదట అని చెప్పాడు. అప్పటికే హౌస్లో ఉన్న తేజస్విని ని హౌస్ మేట్స్ అమర్ కి పరిచయం చేశారు. దాంతో సర్ప్రైజ్ అయ్యాడు. నిన్ను చాలా మిస్ అయ్యాను. చాలా సార్లు తలచుకుని ఏడ్చాను అని అమర్ దీప్ భార్యతో అన్నాడు. కడుపునిండా తిను, నిద్రపో అని తేజస్విని భర్తకు జాగ్రత్తలు చెప్పింది. మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని అమర్ అడిగాడు. ఇంటి సభ్యులతో మాట్లాడిన తేజస్విని బిగ్ బాస్ హౌస్ వీడింది... 

Follow Us:
Download App:
  • android
  • ios