సీరియల్ బ్యాచ్ హెడ్ వెయిట్... పిచ్చోడంటూ యావర్ మీద నోరు పారేసుకున్న శోభా!
మొదటి నుండి సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభా, అమర్ బిహేవియర్ అభ్యంతరకరంగా ఉంటుంది. తాజాగా యావర్ ని పిచ్చోడంటూ శోభా శెట్టి రెచ్చిపోయింది.
బీబీ మారథాన్ లో భాగంగా ప్రతి టాస్క్ లో గెలిచిన హౌస్ మేట్ కెప్టెన్సీ కంటెండర్ అవుతాడని బిగ్ బాస్ ఆదేశించాడు. ఫస్ట్ టాస్క్ లో ప్రియాంక గెలిచి కంటెండర్ అయ్యింది. రెండో టాస్క్ లో ప్రశాంత్ గెలిచాడు. మూడో టాస్క్ లో సందీప్, నాలుగో టాస్క్ లో గౌతమ్, ఐదో టాస్క్ లో శోభా శెట్టి గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ గా బరిలో నిలిచారు. వీరిలో ఒకరు కెప్టెన్ కావాల్సి ఉంది. ఎవరు కెప్టెన్ అయ్యేది మిగతా హౌస్ మేట్స్ నిర్ణయిస్తారని బిగ్ బాస్ చెప్పాడు.
ప్రియాంక, శోభా, ప్రశాంత్, గౌతమ్, సందీప్ లలో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో చెప్పి వారి మెడలో మిర్చి దండ వేయాలి. ప్రియాంకకు అర్హత లేదని భోలే దండ వేశాడు. మిగతా వాళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. నువ్వు నామినేషన్స్ లో లేవు. వాళ్లలో ఎవరు కెప్టెన్ అయినా సేవ్ అవుతారంటూ అమర్... పల్లవి ప్రశాంత్ మెడలో మిర్చి దండ వేశాడు. యావర్... శోభా శెట్టి మెడలో వేయడానికి సిద్దమయ్యాడు. శోభా యావర్ తో గొడవ పెట్టుకుంది. అతన్ని పిచ్చోడు అంటూ నోరు జారింది.
నన్ను పిచ్చోడు అంటావా అని యావర్ ప్రశ్నించగా... మళ్ళీ మళ్ళీ అంటా ఏం చేస్తావని శోభా గట్టిగ అరిచింది. శోభా హెడ్ వెయిట్ క్లియర్ గా అర్థం అవుతుంది. భోలే విషయంలో కూడా శోభా దారుణమైన కామెంట్స్ చేసింది. నాగార్జున భోలేకి మాత్రం వార్నింగ్ ఇచ్చిన శోభాను వెనకోసుకొచ్చాడు. భోలే ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన దానివని శోభాను అన్నందుకు క్లాస్ పీకిన నాగార్జున, యావర్ ని నేరుగా పిచ్చోడు అంటే ఎలా స్పందిస్తాడో చూడాలి.