Bigg Boss Telugu 7: రైతు బిడ్డకు ఊహించని షాక్... శివాజీ కూడా హ్యాండ్ ఇచ్చాడుగా!
హౌస్లో దూసుకుపోతున్న పల్లవి ప్రశాంత్ కి షాక్ తగిలింది. అతడి కెప్టెన్ పదవి పోయింది. ఇందుకు కారణం ఏమిటని పరిశీలిస్తే...
బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ అవతరించిన విషయం తెలిసిందే. దీని కోసం ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా చివరిదైన రంగు పడుద్ది రాజా టాస్క్ లో జాగ్రత్తగా ఆడాడు. తేజా, సందీవ్, గౌతమ్ లతో పోటీ పడి గెలిచాడు. హోస్ట్ నాగార్జున కూడా పల్లవి ప్రశాంత్ ఆట తీరును మెచ్చుకున్నాడు. కెప్టెన్ అయితే అయ్యాడు కానీ ఆ బాధ్యత నెరవేర్చడంలో పల్లవి ప్రశాంత్ ఫెయిల్ అయ్యాడనేది ఇంటి సభ్యుల అభిప్రాయం..
పల్లవి ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ ఆ పదవికి అర్హుడు కాదని ఎంత మంది భావిస్తున్నారో చెప్పాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులను అడిగాడు. దాదాపు హౌస్లో ఉన్న 13 మంది కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. చివరికి అతడు కెప్టెన్ కావడానికి కారణమైన శివాజీ కూడా ప్రశాంత్ కెప్టెన్సీ బాగోలేదని ఓటు వేశాడు. పల్లవి ప్రశాంత్ మాత్రం తన మాట కొందరు వినడం లేదు, లెక్క చేయడం లేదని చెప్పాడు.
ఏదేమైనా మెజారిటీ ఇంటి సభ్యులు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా ఫెయిల్ అని ఓటు వేసిన నేపథ్యంలో అతడి కెప్టెన్సీ పదవి పోయింది. కెప్టెన్సీ నుండి తప్పిస్తూ బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే చర్చ కొనసాగుతుంది.
ఇక ఐదు వారాల్లో ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఆరవ వారానికి యావర్, అమర్ దీప్, తేజా, శోభా శెట్టి, నయని పావని, అశ్విని, పూజా మూర్తి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. శోభా, పూజా మూర్తి రేసులో వెనుకబడ్డట్లు సమాచారం.