Bigg Boss Telugu 7: ఆ విషయంలో అడ్డంగా దొరికిపోయిన పల్లవి ప్రశాంత్... నాగార్జునతో చివాట్లు తప్పవా?
నామినేషన్స్ ప్రక్రియలో సందీప్ ని ఉద్దేశిస్తూ పల్లవి ప్రశాంత్ చేసిన ఆరోపణలు అతడిని నెగిటివ్ చేశాయి. సందీప్ గట్టిగా వాదించడంతో పల్లవి ప్రశాంత్ బుక్ అయ్యాడు.

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ఫేవరేట్స్ లో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. పల్లవి ప్రశాంత్ బాగా ఆడుతున్నాడు. అందుకే నాలుగో పవర్ అస్త్ర గెలుచుకున్నాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. అందరి లాగే పల్లవి ప్రశాంత్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఒక్కోసారి అతని మాట తీరు బాగోదు. అందరినీ గౌరవిస్తూ ఒదిగి ఉండే పల్లవి ప్రశాంత్ కూడా సహనం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.
కాగా ఏడవ వారం నామినేషన్స్ లో సందీప్-పల్లవి ప్రశాంత్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఒక కెప్టెన్ కి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇవ్వలేదని పల్లవి ప్రశాంత్ సందీప్ ని నామినేట్ చేశాడు. అందుకు సందీప్ ఒప్పుకోలేదు. నీది పరిపక్వత లేని గేమ్ అన్నాడు. సందీప్ తిరిగి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య మళ్ళీ అదే డిస్కషన్ వచ్చింది.
ఈ క్రమంలో ఊరోడు అని గతంలో నన్ను అన్నావని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఆ మాట అనలేదని కాన్ఫిడెంట్ గా ఉన్న సందీప్ రెచ్చిపోయాడు. నేను నమ్మిన నటరాజ్ మీద ఒట్టు, ఊరోడు అని నేను అనలేదు. నువ్వు భూమి మీద, తిండి మీద ప్రమాణం చేయమని ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ మాట మార్చాడు. ఊరోడు అనే పదం వాడకపోయినా నా ఊరు, మండలం గురించి మాట్లాడాడు అన్నాడు.
ఈ పాయింట్ దగ్గర పల్లవి ప్రశాంత్ తడబడ్డాడు. అదే సమయంలో సింపథీ గేమ్ ఆడుతున్నాడన్న వాదనకు బలం చేకూర్చాడు. హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో తన రైతు బిడ్డ సెంటిమెంట్ బయటకు తీసే ప్రయత్నం చేశాడు. రేపు హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే పల్లవి ప్రశాంత్ కి చివాట్లు తప్పవు. ఇక ఏం జరుగుతుందో చూడాలి...